వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ కొత్త ఫీచర్: స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌తో కనెక్ట్ చేయొచ్చు..ఎలా అంటే?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ ఆన్‌లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రానుంది. ఇప్పటికే యూజర్ ఫ్రెండ్లీగా పేరుతెచ్చుకున్న ఈ యాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకోనుంది. వాట్సాప్ స్టేటస్‌ ఇకపై నేరుగా ఫేస్‌బుక్‌తో కనెక్ట్ అయ్యేలా యాజమాన్యం అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇందుకోసం గత జూన్‌ నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచే టెస్టింగ్ చేస్తూ వచ్చింది వాట్సాప్ యాజమాన్యం.

కొత్త ఫీచర్ గురించి వాట్సాప్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలా మంది ఔత్సాహికులు మాత్రం దీని గురించి పూర్తి వివరాలు తెలపాలంటూ ట్విటర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. భారత్‌లో ఆండ్రాయి 2.19.258 వెర్షన్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అయితే ఐఫోన్‌లో ఈ సదుపాయం ఇంకా రాలేదని సమాచారం. వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్ స్టోరీతో అనుసంధానం అయ్యేలా చేస్తున్నామంటూ వాట్సాప్ తన వెబ్‌సైట్‌లోని FAQలో రాసుకొచ్చింది.

WhatsAPP new feature: You can now share your status to Facebook story

ఒకవేళ ఇప్పటికే వినియోగదారుడి ఫోన్ అప్‌డేట్ అయి ఉంటే మై స్టేటస్ అనే దానికింద షేర్ టూ ఫేస్‌బుక్ స్టోరీ అనే ఫీచర్ కనిపిస్తుందని దాని పక్కనే షేర్ బటన్ ఉంటుందని యాజమాన్యం తెలిపింది. ఆ బటన్‌ పై క్లిక్ చేస్తే స్టేటస్‌ను షేర్ చేసుకునేందుకు వీలుగా ఫేస్‌బుక్ యాప్‌తో పాటు మిగతా యాప్‌లు కూడా కనిపిస్తాయని.. వినియోగదారుడికి నచ్చిన యాప్‌లో తన స్టేటస్‌ను షేర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది వాట్సాప్ యాజమాన్యం. అంతేకాదు మల్టిపుల్ స్టేటస్‌లను వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకునేలా వీలు కల్పిస్తోంది.

English summary
The online chatting app Whatsapp had brought in a new feature that connects user status directly to facebook story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X