వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్.. ప్లీజ్... మీ ప్రైవసీకి భంగం కలిగించం.. స్టేటస్ షేర్ చేసిన వాట్సాప్...

|
Google Oneindia TeluguNews

యూజ‌ర్లు ఎదురు తిర‌గ‌డంతో వాళ్ల‌ను బ‌తిమాలే ప‌నిలో ప‌డింది వాట్సాప్. మీ ప్రైవ‌సీకి ఎలాంటి భంగం వాటిల్ల‌బోదు అని యూజ‌ర్ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నాలను చేస్తోంది. ఇప్ప‌టికే కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అమ‌లును మే వ‌ర‌కూ నిలిపేసిన వాట్సాప్.. తాజాగా త‌న స్టేట‌స్‌ను అప్‌డేట్ చేసింది. యూజ‌ర్ల‌కు స్టేట‌స్‌లు చూసే అల‌వాటు ఉంద‌ని గ్ర‌హించిన ఆ సంస్థ‌.. ఆ స్టేట‌స్ ద్వారానే త‌న గోడు వెల్ల‌బోసుకుంది.

యూజర్ల ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉన్నామని.. మీ కాంటాక్ట్‌ల‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోమని తేల్చిచెప్పింది. ప్రైవేట్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాబ‌ట్టి వాటిని మేము చూసే, వినే అవకాశం లేదని చెప్పింది. షేర్ చేసిన లొకేష‌న్‌ను కూడా చూడ‌మని స్ప‌ష్టం చేసింది. త‌మ డేటాకు భ‌ద్ర‌త లేద‌ని తెలిసిన చాలా మంది యూజ‌ర్లు ఇప్ప‌టికే వాట్సాప్‌ను వీడి టెలిగ్రామ్‌, సిగ్న‌ల్‌లాంటి ప్ర‌త్యామ్నాయాల వైపు వెళ్తున్నారు. దీంతో వాట్సాప్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

WhatsApp shares WhatsApp status to give assurance on user privacy..

ప్రైవ‌సీ పాల‌సీ మారుతోందని అని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల డేటా అంతా మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని తెలిపింది. దీనికి అంగీక‌రిస్తేనే వాట్సాప్ వాడండి.. లేదంటే లేదు అని యూజ‌ర్ల‌కు నోటిఫికేషన్ కూడా పంపింది. అయితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. యూజర్లకు స్టేటస్ షేర్ చేసింది. అందులో వినమ్రంగా విన్నవించింది.

English summary
WhatsApp on Sunday shared its own status on the messaging app to assure users of its commitment to their privacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X