వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాడ్ న్యూస్ : ఈ స్మార్ట్ ఫోన్లపై వాట్సాప్ ఇక పని చేయదు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ దైనందిత జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను చూడకుండా ఉండలేము. అంతలా వాట్సాప్ మనిషి జీవితంతో ముడిపడిపోయింది. అయితే వాట్సాప్ ఇక కనిపించదు అని తెలిస్తే పరిస్థితేంటి..? అసలు ఆ వార్తను జీర్ణించుకోగలరా..? ఆ వార్తను కలలో కూడా వినాలనుకోరు. అంతలా మమేకమైపోయింది. కానీ ఇది నిజం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వాట్సాప్ ఉండదట. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.

సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సాప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కనిపించదు. అయితే ఇది కొన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే. పాత స్మార్ట్ ఫోన్లు లేదా అప్‌డేట్ కానీ ఫోన్లు వినియోగిస్తున్నట్లయితే అలాంటి ఫోన్లలో వాట్సాప్ ఇక కనిపించదు లేదా సపోర్ట్ చేయదు. అయితే అందరికీ ఓ సందేహం కలగొచ్చు. పాత స్మార్ట్ ఫోన్లు అంటే ఎలాంటి మోడల్స్ అని. ఇందుకు వాట్సాప్ సంస్థ వివరణ ఇచ్చింది. ఐఓఎస్ 8 లేదా ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7లాంటి పాత స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నట్లయితే ఫిబ్రవరి 2020 నుంచి వాట్సాప్‌ ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లలో పనిచేయదని స్పష్టం చేసింది.

WhatsApp will stop working on these smartphones, Check out

ఇక వాట్సాప్ అప్‌డేటెడ్ వర్షెన్‌ అంటే అన్ని ఫీచర్లు కలిగి ఉన్న వాట్సాప్ కావాలంటే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌లను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను వినియోగించాలని వాట్సాప్ సూచిస్తోంది . ఇంకా పాత మోడల్ ఐఫోన్ వినియోగిస్తున్నట్లయితే యాపిల్ సపోర్టు వెబ్‌సైట్‌ను లాగిన్ అయి మీ ఐఫోనును లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే అన్‌లాక్ లేదా మోడిఫై అయిన ఐఫోన్లు పక్కాగా వాట్సాప్‌ను సపోర్ట్ చేస్తాయని చెప్పలేమని సంస్థ వెల్లడించింది. ఎందుకంటే మార్పులు చేసిన ఐఫోన్లు డివైస్‌ పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని వెల్లడించింది. అదే సమయంలో ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు జరిగి ఉంటే దానికి సపోర్ట్ ఇవ్వలేమని వాట్సాప్ వెల్లడించింది.

2020 ఫిబ్రవరి నుంచి వాట్సాప్ బంద్ కాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడి సాఫ్ట్ వేర్‌‌ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ తన సపోర్ట్ పేజ్‌పై రాసుకొచ్చింది.

English summary
According to WhatsApp support page, if you are still using a smartphone running iOS 8 or Android version 2.3.7, WhatsApp will not work on your device from February 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X