వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటపడని కోణం: కార్గిల్‌లాంటి చర్యకి బేనజీర్ చెక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కార్గిల్ యుద్ధం 1999 వేసవిలో జరిగింది. అయితే, ఆ యుద్ధానికి కంటే ముందే పాకిస్తాన్ అలాంటి చర్యకు ప్రణాళిక వేసిందా? నాటి ప్రధాని బేనజీర్ భుట్టో అడ్డుపడటంతో సాధ్యం కాలేదా? అంటే అవుననే అంటున్నరు భారత మాజీ దౌత్యాధికారి రాజీవ్ డోగ్రా.

రక్తమోడిన సరిహద్దులు... భారత్-పాక్ సంబంధాల్లో బయటపడని కోణం.. అనే అర్థం వచ్చే శీర్షికతో ఆయన పుస్తకం వెలువరించారు. బేనజీర్ స్వతహాగా ఉదారంగా ఉంటారని, కనీసం ఓసారి కార్గిల్ తరహా యుద్ధాన్ని ఆమె నిలువరించారని ఆయన పేర్కొన్నారు.

When Benazir Bhutto opposed a Kargil-type operation!

ముషారఫ్ ఓ దశలో యుద్ధ ప్రతిపాదన తెచ్చారని, పాకిస్తాన్ సులభంగా నెగ్గుతుంది, శ్రీనగర్ కైవసం చేసుకుంటుందని చెప్పాడని రాశారు. దానికి అంగీకరిస్తే శ్రీనగర్ నుంచే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వైదొలగాల్సిందిగా భారత్ పట్టుబడుతుంది బేనజీర్ భుట్టో చెప్పారని రాశారు.

ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరంపై యూఎన్ఓ తీర్మానాన్ని ఆమె గుర్తు చేశారు. విపరీత పరిణామాలుంటాయని ఆమె హెచ్చరించారని పేర్కొన్నారు. వాజపేయి ఢిల్లీ - లాహోర్ బస్సు యాత్రను చేపట్టినప్పుడు కార్గిల్ శిఖరాలను పాకిస్తాన్ సైనికులు ఆక్రమిస్తున్న విషయం అప్పటి ప్రధాని షరీఫ్‌కు తెలుసునని చెప్పారు.

బస్సు వచ్చినప్పుడు వాజపేయిని ఆలింగనం చేసుకునేందుకు నవాజ్ షరీఫ్ ఒకింత అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. 1993 ముంబై పేలుళ్ల గురించి నవాజ్ షరీఫ్‌కు ముందే తెలుసునని చెప్పారు. పాకిస్తాన్ సుప్రీం న్యాయమూర్తి ఒకరు తనకు ఈ విషయం చెప్పారని పేర్కొన్నారు.

English summary
Pakistan Army had planned a Kargil-type military operation much before the summer of 1999 when Benazir Bhutto was the prime minister but she stood her ground against the idea, a new book by a former diplomat says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X