• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

By BBC News తెలుగు
|

బ్యాలెట్ బాక్సు వద్ద ట్రంప్, బైడెన్

అమెరికా అధ్యక్ష పదవికి 20 సంవత్సరాల క్రితం అల్బెర్ట్ గోర్, జార్జి డబ్ల్యూ బుష్ పోటీ చేసినప్పుడు పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాల కోసం అమెరికా ప్రజలు 36 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది.

మళ్ళీ అలాంటి పరిస్థితి 2020లో తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకని?

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి, గంటల కొద్దీ లైనులో నిల్చుని ఓటు వేయడానికి భయపడే అవకాశం ఉంది. దీంతో కొన్ని లక్షల మంది ప్రజలు పోస్టల్ బ్యాలట్ ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీటన్నిటినీ లెక్కించడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.

సాధారణంగా ఎన్నికల రోజు రాత్రి ఏమి జరుగుతుంది?

అమెరికాలోని వివిధ రాష్ట్రాలు విభిన్న సమయాలలో ఓటింగ్‌ని నిలిపివేస్తాయి.

ముందుగా ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు వోటింగ్ నిలిపివేస్తారు. ఆ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు మొదలవ్వగానే వోటింగ్ ఫలితాల మొత్తం తెలుస్తూ ఉంటుంది.

అయితే, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఓట్లు సాధించినంత మాత్రాన వారు అమెరికాకు అధ్యక్షులవ్వరు. రాష్ట్రాల వారీగా ఎలక్టరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలవుతారు. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి.

ఒక రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు గెలిచిన అభ్యర్ధికి రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ కాలేజ్‌ ఓట్లను కేటాయిస్తారు. ఎన్నికైన ప్రతినిధులందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజీ అంటారు

ఒక రాష్ట్రంలో అభ్యర్ధి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసినప్పటికీ దానిని అధికారిక ఫలితంగా చెప్పలేము. ఎందుకంటే ఇంకా చాలా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

సాధారణంగా ఈ ప్రక్రియను రాత్రి పూట ముగిస్తారు. దాని తరువాత ముందుగా ప్రణాళిక చేసినట్లుగానే ఓడిపోతున్న అభ్యర్థి ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం ఇది సాధ్యపడేలా కనిపించటం లేదు.

2016 ఎన్నికల ఫలితాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రాత్రి 3 గంటల సమయంలో న్యూయార్క్‌లో వేలమంది అభిమానుల నడుము తన విజయోత్సవ ప్రసంగం చేశారు. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, 270కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు.

ఆ తరువాత, డెమొక్రటిక్ ఓట్లను లెక్కిస్తున్నప్పుడు హిల్లరీ క్లింటన్ ఆధిక్యంలో కనిపించారు కానీ, అప్పటికే ఎలక్టోరల్ కాలేజ్ ఓడిపోయింది.

ముందుగానే పోస్టల్ ఓట్లు వేస్తున్న అమెరికన్లు

అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు

సాధారణంగా అమెరికాలో ఎన్నికల రోజు చాలామంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో మెయిల్ ద్వారా ఓటు వేయడం ప్రాముఖ్యం చెందింది.

గతంలో కూడా ఎవరైనా అమెరికా పౌరుడు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ విదేశాలలో ఉంటే పోస్టు ద్వారా ఓటు వేయడం అమెరికాలో సాధారణమైన విషయమే. కానీ, ఇప్పుడు ఈ సౌలభ్యాన్ని చాలా మందికి అందిస్తున్నారు.

ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో అధిక సంఖ్యలో ఓటర్లు పోస్టు ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటామని విజ్ఞప్తులు చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనీసం 8 కోట్ల మంది ప్రజలు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేస్తారని అంచనా.

ఈ ప్రక్రియ వలన ఓట్లను లెక్కించడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనికి కేవలం అధిక సంఖ్యలో ఓట్లు వేసిన వారు ఉండటం మాత్రమే కాకుండా, ఈ కీలకమైన సమయంలోనే యు ఎస్ పోస్టల్ సర్వీస్ లో అనేక ఉద్యోగ కోతలు చోటు చేసుకోవడం కూడా ఒక కారణం.

ముందుగా బ్యాలట్ పేపర్లను ఓటర్లకు పంపాలి. వారు ఓటు వేసిన తరువాత వాటిని తిరిగి ఎన్నికల అధికారులకు ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన గడువు తేదీ లోగా తిరిగి పంపాలి.

ఈ ఏడాది కనీసం 8 కోట్ల మంది ప్రజలు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేస్తారని అంచనా.

పోస్టల్ ఓట్లను ఎలా లెక్కిస్తారు?

ఎన్నికల నియమావళిని నిర్దేశించేందుకు రాష్ట్రాలకు అపరిమిత అధికారాలు ఉంటాయి. ఒక పోస్టల్ ఓటుకు అర్హత ఎప్పటి వరకు ఉంటుందో అధికారం కూడా రాష్ట్రాలకు ఉంటుంది.

పెన్సిల్వేనియా రాష్ట్రం స్థానిక కాలమానం ప్రకారం ఎన్నికల రోజున రాత్రి 8 గంటల లోపు వచ్చిన ఓట్లను మాత్రమే లెక్కిస్తుంది.

అదే కాలిఫోర్నియా అయితే ఎన్నికల ముగిసిన కొన్ని వారాల తరువాత పోస్టల్ బ్యాలెట్లో ఓటు వచ్చినా పరిగణిస్తుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమవుతుంది.

పోస్టు ద్వారా వేసిన ప్రతీ ఓటు పైన తప్పనిసరిగా సంతకం చేసి ఉండాలి. ఆ సంతకాన్ని ఓటరు నమోదు కార్డు పై ఉన్న సంతకంతో పోల్చి చూస్తారు. దీని వలన పోస్టల్ బ్యాలట్ లెక్కింపు చాలా సమయం తీసుకుంటుంది.

గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు పోస్టు ద్వారా తమ ఓటును వేస్తారని అంచనా వేస్తున్న సమయంలో , ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలు ఎన్నికల రోజుకు ముందు రోజే సంతకాల తనిఖీ ప్రారంభించి , మరుసటి రోజు పొద్దున్న నుంచే ఓట్లు లెక్కింపు చేయడం మొదలు పెట్టేస్తారు.

ఏ యే రాష్ట్రాలు ఓట్ల లెక్కింపును ఎప్పుడు మొదలు పెడతాయనే పూర్తి జాబితా నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ దగ్గర ఉంటుంది.

అమెరికా ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేస్తె ఎక్కువ సమయం పడుతుందా?

2020 లో నిర్వహించిన ప్రాధమిక ఎన్నికలు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల రోజు కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవడానికి అవకాశం దొరికింది. న్యూ యార్క్ నుంచి అలస్కా వరకు చాలా రాష్ట్రాలు సంప్రదాయ పద్దతిలో వోటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సరిగ్గా పని చేయని వోటింగ్ మెషీన్లు, సిబ్బంది కొరత, భౌతిక దూరం నియమాలు కలిసి వోటింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్ల లైన్లు కనిపించాయి.

ఇదంతా చూసి అమలు చేసిన మార్పులు ఎన్నికల ప్రక్రియను పొడిగించాయి.

కెంటకీ రాష్ట్రం పోలింగ్ స్టేషన్ల సంఖ్యను తగ్గించి పోలింగ్ స్టేషన్లు తెరిచి ఉంచే సమయాన్ని పొడిగించింది. మహమ్మారిని అడ్డంగా పెట్టుకుని మైనారిటీ ఓట్లను అణిచివేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.

అలస్కా లో ఓటర్లు అందరినీ పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేయమని ఒత్తిడి చేసింది. జార్జియాలో పోలింగ్ మెషీన్లు సరిగ్గా పని చేయకపోవడం పట్ల కోర్టు కేసులు ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
There might be a delay in declaring the US President Elections results due to pandemic.ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X