వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇట్టాంటి రిపోర్టర్లంతా నీకెట్టా దొరికారయ్యా?: పాక్ ప్రధానిని ప్రశ్నించిన ట్రంప్: బిత్తరపోయిన ఇమ్రాన్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ సమక్షంలో పాకిస్తాన్ కు చెందిన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బిక్కమొహం వేయాల్సి వచ్చింది. తలదించుకోవాల్సి వచ్చింది. తమ దేశానికి చెందిన ఓ విలేకరి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కు సంధించిన ఓ ప్రశ్న ఆయనకు చిరాకు తెప్పించింది. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వని డొనాల్డ్ ట్రంప్.. ఇలాంటి రిపోర్టర్లను మీకెక్కడ దొరికారు? అంటూ ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించడంతో ఆయన ముఖంలో నెత్తుటి చుక్క లేకుండా పోయింది. డొనాల్డ్ ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ఘటన తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవమానం..

జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవమానం..

జమ్మూ కాశ్మీర్ అంశంపై కీలక ప్రకటన చేయడానికి డొనాల్డ్ ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ సంయుక్త విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా, పాకిస్తాన్ విలేకరులు హాజరయ్యారు. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి స్వయంగా తానే మధ్యవర్తిత్వాన్ని వహిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి భారత్, పాకిస్తాన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, ఇమ్రాన్ ఖాన్ అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో, సామరస్యపూరకంగా కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానంటూ ట్రంప్..ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కు భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులు ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చని చెప్పారు.

కాశ్మీర్ అంశంపై పాక్ విలేకరి ప్రశ్నకు..

కాశ్మీర్ అంశంపై పాక్ విలేకరి ప్రశ్నకు..

దీనితో- పాకిస్తాన్ కు చెందిన ఓ విలేకరి.. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఆ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోందని చెప్పారు. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయిందని, కాశ్మీరీ ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. సాధారణ పరిస్థితులు లేవని అన్నారు. 50 రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయని చెప్పారు. ఇవన్నీ మీ దృష్టికి వచ్చాయా? అంటూ డొనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. విలేకరిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ- `మీరు ఇమ్రాన్ ఖాన్ ప్రతినిధుల బృందం సభ్యులా?. మీరు ప్రశ్న అడుగుతున్నట్టుగా లేదు. ప్రకటన చేసినట్టుగా ఉంది..` అని అన్నారు.

ఇలాంటి రిపోర్టర్లు మీకెలా దొరికారంటూ..

అయినప్పటికీ- ఆ విలేకరి ఊరుకోలేదు. ట్రంప్ నుంచి సమాధానాన్ని రాబట్టడానికి ప్రయత్నించారు. మరోసారి అదే ప్రశ్నను మళ్లీ ట్రంప్ కే సంధించారు. దీనితో ట్రంప్ కు చిర్రెత్తినట్టయింది. వెంటనే- ట్రంప్ తన పక్కనే కూర్చున్న ఇమ్రాన్ ఖాన్ వైపునకు తిరిగారు. `వేర్ డు యు ఫైండ్ రిపోర్టర్స్ లైక్ దీస్?.. ` అని ప్రశ్నించారు. ఏ మాత్రం ఊహించని విధంగా ఏకంగా అమెరికా అధ్యక్షుడి వైపు నుంచే ఈ తరహా ప్రశ్న ఎదురు కావడంతో ఇమ్రాన్ ఖాన్ బిత్తరపోయారు. బిక్కమొహం వేశారు. వెంటనే సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. నీళ్లు నమిలారు. వచ్చీ, రాని చిరునవ్వుతో ఆ పరిస్థితిని అధిగమించారాయన. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఉన్న కొందరు పాకిస్తాన్ అత్యున్నత అధికారులు సైతం తల వంచుకున్నారు.

English summary
Prime Minister Imran Khan had an embarrassing moment during a joint press conference with Donald Trump in New York when the US President mocked a Pakistan journalist for his rhetoric on the Kashmir issue. When a Pakistani journalist asked Trump about the situation in Kashmir, Trump asked him whether he was a member of Khan’s team. “Are you from his (Imran Khan) team? You are making a statement, not asking a question,” the US President snubbed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X