వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దేశాలకు వ్యాక్సిన్ ఆలస్యమైతే నష్టమే .. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఘేబ్రెయేసస్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాటం చేయడానికి కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం అందించనున్నట్లు ఇటీవల పేర్కొన్న ఆయన తాజాగా పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ లభ్యత అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

Recommended Video

COVID-19 Vaccine : ఆ దేశాలలో ప్రజలకు టీకాలు వేయకపోతే, వైరస్ మరింత వ్యాప్తి! -WHO Chief || Oneindia

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతకు కరోనా భయం: సెల్ప్ క్వారంటైన్‌లోకి: వర్క్ ఫ్రమ్ హోమ్ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతకు కరోనా భయం: సెల్ప్ క్వారంటైన్‌లోకి: వర్క్ ఫ్రమ్ హోమ్

కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ప్యారిస్ పీస్ ఫోరంలో మాట్లాడిన ఆయన అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ "టీకా జాతీయవాదం" గురించి హెచ్చరించారు.

WHO Chief Warning ..vaccine nationalism will prolong the pandemic

పారిస్‌లో జరిగే అంతర్జాతీయ శాంతి సదస్సులో కరోనావైరస్ వ్యాక్సిన్ల పంపిణీని నిర్ధారించడానికి 425 మిలియన్ డాలర్లు వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ కేసులు ఇప్పటికే పలు దేశాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో పేద దేశాలలో ప్రజలకు టీకాలు వేయకపోతే, వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని, దానివలన ఆర్థిక పునరుద్ధరణ కూడా ఆలస్యం అవుతుంది అంటూ పేర్కొన్నారు.

ముఖ్యంగా వైద్య సిబ్బంది, వృద్ధులు, ప్రమాదం పొంచిఉన్న ఇతర వర్గాల ప్రజలకు ఈ సౌలభ్యం ముందుగా అందుబాటులో ఉండాలని అన్నారు.

ఇది ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి మాత్రమే కాకుండా, అత్యవసర ఆర్థిక పరిస్థితి కూడా అంటూ పేర్కొన్నారు. ఏ ఒక్క దేశము ఒంటరిగా సవాళ్లను పరిష్కరించలేదంటూ సంపన్న దేశాలను ఉద్దేశించి హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఘేబ్రెయేసస్ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన పరికరాలను, సామాగ్రిని సమానంగా పంపిణీ చేయడానికి ఆరోగ్య సంస్థ, యూరోపియన్ కమిషన్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ఫ్రాన్స్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయని చెప్పారు . ఫ్రాన్స్ € 100 మిలియన్లు, స్పెయిన్ € 50 మిలియన్లు మరియు యూరోపియన్ కమిషన్ 100 మిలియన్లు, ప్రత్యేకంగా ACT- యాక్సిలరేటర్ అని పిలవబడే ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నిధుల కొరత వల్ల అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

English summary
An international peace summit in Paris is expected to raise more than €425 million ($500 million) towards ensuring a fair distribution of coronavirus vaccines, organizers said Thursday.As World Health Organization chief Tedros Adhanom Ghebreyesus warned of "vaccine nationalism" prolonging the pandemic, equitable worldwide access to COVID-19 medication was the key objective at the Paris Peace Forum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X