వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాపైనా జిహాద్.. అణుబాంబు ప్రయోగించండి: హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ముంబై పేలుళ్ల సూత్రధారి, పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అగ్రరాజ్యం అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంపైనా జిహాద్(పవిత్రయుద్ధం) ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు.

ఉగ్రవాదం అణిచివేతలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్విట్టర్ వేదికగా విరుచుకుపడడం, ట్రంప్ ట్వీట్ వెలువడిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్‌కు సైనికసాయం నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించడం తెలిసిందే.

విరుచుకుపడిన హఫీజ్ సయీద్...

విరుచుకుపడిన హఫీజ్ సయీద్...

‘పాకిస్థాన్‌కు గత 15 ఏళ్లలో రూ.2.10 లక్షల కోట్లు (33బిలియన్‌ డాలర్లు)కు పైగా ఆర్థిక సాయం అందించాం. దీనివల్ల ఒరిగిందేమీ లేదు. అక్కడి నాయకులు అబద్ధాలు చెబుతూ, నమ్మక ద్రోహం చేశారు..' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేసిన రోజే హఫీజ్ సయీద్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించాడు. అమెరికాపై.. పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించాల్సిన సమయం అసన్నమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇజ్రాయెల్, అమెరికాలపై జిహాద్...

ఇజ్రాయెల్, అమెరికాలపై జిహాద్...

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా, ఇజ్రాయెల్‌పై బహిరంగంగానే జిహాద్ ప్రకటించాడు. ఈ మేరకు లాహోర్‌లో ర్యాలీ కూడా నిర్వహించాడు. ఈ ర్యాలీలో హఫీజ్‌తో పాటు, జమాత్‌-ఉద్‌-దవా నేత అబ్దుల్‌ రెహమాన్‌ మఖ్కీ కూడా పాల్గొన్నాడు. ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని చేపట్టినట్లు పేర్కొన్నప్పటికీ దీని వెనుక ప్రధాన ఉద్దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున పాకిస్తాన్‌పై ట్రంప్‌‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే అని తెలుస్తోంది. ర్యాలీ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మఖ్కీ మాట్లాడుతూ ‘హిందూ, క్రిస్టియానిటీపై పోరాటం చేసేందుకు అల్లా పూర్తి శక్తినిస్తాడని ఆశిస్తున్నా..' అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.

అమెరికాపై అణుబాంబు వేయండి...

అమెరికాపై అణుబాంబు వేయండి...


అమెరికాపై పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌సయీద్‌ తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. పాకిస్తాన్ అణుబాంబును తీయాల్సిన సమయం అసన్నమైందని, దాన్ని అడ్డుకోవడం అమెరికా తరం కూడా కాదని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఐసిస్ ప్రభావం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. జిహాద్ అంతానికి అమెరికా కుట్రలు చేస్తోందంటూ దుయ్యబట్టాడు. ‘పాకిస్తాన్ అణ్వాయుధం ఇస్లాం ఆస్తి. జెరూసలేం విషయంలో దీన్ని ఉచితంగా ప్రయోగించవచ్చు. ఇది నా బహిరంగ ప్రకటన. ఇస్లామిక్ దేశాలచీఫ్‌లతో సదస్సు ఏర్పాటు చేసి జిహాద్‌ ప్రకటిస్తున్నాం..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హఫీజ్‌ను ఆడిస్తోంది.. పాకిస్తానేనా?

హఫీజ్‌ను ఆడిస్తోంది.. పాకిస్తానేనా?


సయీద్‌పై పాకిస్థాన్‌ మోపిన అభియోగాలు కోర్టులో రుజువుకాకపోవడంతో ఇటీవల అతను విడుదలై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హఫీజ్ సయీద్ బయట ఉండడం అత్యంత ప్రమాదకరమని, అతడ్ని తక్షణమే అరెస్టు చేయాలని అమెరికా పాకిస్తాన్‌కు అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ విషయంలో పాకిస్తాన్ మెతక వైఖరి అవలంభిస్తోంది. తన ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేసే హఫీజ్‌ను ఆ దేశం అవసరమైనప్పుడల్లా ఒక పావులా వాడుకుంటోంది. అందుకే అతడ్ని అరెస్టు చేసే విషయంలోనూ జాప్యం చేస్తోంది. ప్రస్తుతం మిల్లి ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌) పేరుతో పార్టీని స్థాపించి 2018లో పాకిస్తాన్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో హఫీజ్ ఉన్నాడు.

English summary
Pakistan-based international terrorist Hafiz Saeed has openly called for Jihad against the US and even urged the Pakistani authorities to use the country’s nuclear bombs for this purpose. Saeed’s threats came on a day when US president Donald Trump denounced Pakistan’s years of “lies and Deceit” openly on the social media. “The United States has foolishly given Pakistan more than 33 billion dollars in aid over the last 15 years, and they have given us nothing but lies & deceit, thinking of our leaders as fools. They give safe haven to the terrorists we hunt in Afghanistan, with little help. No more!,” Trump had tweeted in the New Year’s Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X