వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కలకలం: డబ్ల్యూహెచ్ఓతో కలిసి ‘కరోనా’ దాచేయత్నం చేసిన డ్రాగన్

|
Google Oneindia TeluguNews

జెనీవా: వుహాన్ నగరంలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించిన సమాచారాన్ని దాచిపెట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్‌ను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కోరినట్లు జర్మనీ మెగజైన్ డెర్ స్పీగెల్ వెల్లడించింది. అయితే. ఈ నివేదికలను ప్రపంచ ఆరోగ్యం సంస్థ తాజాగా ఖండించింది.

 చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

కరోనాను బయటపెట్టకూడదని..

కరోనాను బయటపెట్టకూడదని..

కరోనావైరస్ మనుషులతో మనుషులకు వ్యాపిస్తుందనే విషయాన్ని అప్పుడే బయటపెట్టకూడదని జీ జిన్‌పింగ్ .. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్‌ను జనవరి 21, 2020న కోరినట్లు గుర్తించామని జర్మనీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ బీఎన్డీ తెలిపింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని డాక్టర్ టెడ్రోస్ స్పష్టం చేశారు.

కరోనాపై వెంటనే హెచ్చరికలు చేయలేదు..

కరోనాపై వెంటనే హెచ్చరికలు చేయలేదు..

జనవరిలో టెడ్రోస్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అసలు ఫోన్లో మాట్లాడుకోలేదు.. ఇలాంటి అవాస్తవ కథనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచం మరలుస్తాయని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. కాగా, జనవరి 20నే కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే హెచ్చరికలు చేయకపోవడం వల్లే ప్రపంచం అప్రమత్తం కావడంలో నాలుగు వారాలు వృథా అయ్యాయని బీఎన్డీ వెల్లడించింది. జనవరి చివరి వారం వరకు కూడా ప్రపంచ అత్యయిక పరిస్థితిని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించలేదని ఆరోపించింది.

Recommended Video

Indian Army and Chinese Soldiers Clash At Border
గత సెప్టెంబర్ నుంచే కరోనా వ్యాప్తి..

గత సెప్టెంబర్ నుంచే కరోనా వ్యాప్తి..

జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ కూడా బీఎన్డీ ఇచ్చిన సమాచారం సరైనదేనని పేర్కొంది. కరోనావైరస్ వ్యాపిస్తుందని తెలిసినా కూడా చైనా ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేదని ఆరోపించింది. కాగా, గత సెప్టెంబ్ నుంచే కోనా వైరస్ వ్యాపిస్తోందని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు గుర్తించారు. సెప్టెంబర్-డిసెంబర్ మధ్యలో కరోనా వ్యాపించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తన కథనంలో వెల్లడించింది. కాగా, మార్చి మధ్యలో కరోనాను మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చైనా కుట్ర వల్లే ప్రపంచం కరోనా బాధితంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
The World Health Organization denied reports on Saturday by German magazine Der Spiegel that Chinese President Xi Jingping had asked Director-General Tedros Adhanom Ghebreyesus to cover up news about the coronavirus outbreak in Wuhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X