వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్య అధ్యక్ష బరిలో అతివ: మూడోస్థానంలో జో జోర్గెన్సెన్.. ఇంతకీ ఈమె ఎవరు, నేపథ్యమేంటీ...?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కొనసాగుతోన్నాయి. అయితే రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ మధ్య పోరు జరుగుతోన్న సంగతి తెలిసిందే. బిడెన్ విజయం వైపు పయనిస్తున్నారు. అయితే తెరపైకి మూడో అభ్యర్థి కూడా ఉన్నారు. లిబర్టేరియన్ అధ్యక్ష అభ్యర్థి జో జోర్గెన్సెన్ ఉన్నారు. అయితే ఈ మహిళ నేత ఎవరూ..? నేపథ్యం ఏంటీ అనే అంశం చర్చకు దారితీసింది. ఆమె రాజకీయ నేపథ్యం గురించి తెలుసుకుందాం పదండి.

లెక్చరర్ నుంచి

లెక్చరర్ నుంచి

జోర్గెన్సన్ (63) క్లెమన్సాన్ వర్సిటీకి చెందిన సీనియర్ లెక్చరర్. వ్యాపార, సైకాలజీ, చరిత్ర చదివే పీహెచ్‌డీ స్కాలర్లకు బోధించవారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో లిబర్టేరియన్ పార్టీ బరిలోకి దింపారు. అయితే మహిళకు అవకాశం ఇవ్వడం విశేషం. డెమోక్రటిక్ ఉపాధ్యక్ష పదవీకి కమలా హ్యరిస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 2016లో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష బరిలో నిలిచిన.. ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జోర్గెన్సెస్ దేశవ్యాప్తంగా 1.6 మిలియన్ ఓట్లను గెలుచుకున్నారు.

ప్రత్యామ్నాయం అని..

ప్రత్యామ్నాయం అని..


పెన్సిల్వేనియ, జార్జియాలో ఉత్కంఠభరితంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే జోర్గెన్సెన్ మాత్రం తమ ఓట్లు తమకు పోలయ్యాయని.. ఇతర పార్టీల ఓట్లు తీసుకోలేదని చెబుతున్నారు. ఆ ఓట్లు అమెరికన్లకు చెందినవని తెలిపారు. తమ పార్టీ అంటే విశ్వాసంతోనే ప్రజలు ఓట్లేశారు అని చెప్పారు.

జార్జియాలో పట్టు

జార్జియాలో పట్టు

డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ కాక.. తమ పార్టీ స్వతంత్రంగా ఓటు వేశారని జోర్గెన్సెన్ తెలిపారు. జార్జియాలో శుక్రవారం వరకు 61 వేల 391 ఓట్లు జోర్గెన్సెన్ పార్టీకి వచ్చాయని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది. 2016లో మూడో పార్టీ గ్రీన్ పార్టీకి చెందిన జిల్ స్టెన్, లిబర్టియన్ పార్టీకి చెందిన గ్యారీ జాన్సన్ మంచి ఓట్లను సాధించారని తెలిపారు. అప్పుడు మిచిగాన్‌ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలువాల్సి ఉంది. అయితే జాన్సన్, స్టెయిన్ ఇద్దరికీ కలిసి 2 లక్షల 22 వేల 400 ఓట్లు సాధించారు. దీంతో మిచిగాన్‌లో 10 వేల 704 ఓట్ల తేడాతో ట్రంప్ గెలిచారు.

పార్టీ ఆవిర్భావం..

పార్టీ ఆవిర్భావం..


1971లో లిబర్టియన్ పార్టీని స్థాపించారు. ప్రజల వ్యక్తిగత, కుటుంబం, వ్యాపార నిర్ణయాలతో జోక్యాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని ఏర్పాటు చేశారు. పన్నులు విధించడంపై వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఆ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ సారి జోర్గెన్సెన్ బరిలోకి దిగారు.

English summary
Jorgensen, 63, a mother of two and a Clemson University senior lecturer made history as the Libertarian Party’s first female nominee for president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X