ఎవరీ కులభూషణ్?: 'పాకిస్తాన్ ఉరిశిక్షపై గట్టిగా స్పందించాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గూఢచర్యం, విద్రోహ చర్యల కింద అరెస్టు చేసి పాకిస్తాన్ ఉరిశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ ఎవరు? పాక్ ఆరోపిస్తున్నట్లుగా ఆయన రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) వింగ్ అధికారేనా? అతడు నిజంగానే పాక్ వ్యతిరేక విద్రోహ చర్యలకు పాల్పడ్డారా? పాక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉంది? అనే విషయాలపై చర్చ జరుగుతోంది.

దీనిని పరిశీలిస్తే.. మన ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కులభూషణ్ జాదవ్ ఇండియన్ నేవీ అధికారిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు రా అధికారి అని ఆరోపిస్తోంది.

భారత్‌ను రెచ్చగొట్టే దోరణి: కుల్ భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాక్ కోర్టు

Who is Kulbhushan Jadhav, the man Pakistan framed

- ఇరాన్ నుంచి బెలూచిస్తాన్‌లోకి అడుగు పెట్టగానే పాక్ పోలీసులు 2016 మార్చి 3న అరెస్టు చేసినట్లుగా ఊహాగానాలు ఉన్నాయి.
- ఇరాన్ నుంచి అతడిని అరెస్టు చేసి తీసుకు వచ్చినట్లు భారత్ ఆరోపిస్తోంది.
- ఏప్రిల్ 2016లో కులభూషణ్‌పై ఉగ్రవాదం, దేశద్రోహం చర్యలు ఆరోపణలు చేసింది.
- ఆయనను తిరిగి పంపించేందుకు ఇస్లామాబాద్‌లోని ఎగువ సభ నిరాకరించిందని చెబుతూ ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్ ప్రధాని సలహాదారు, విదేశాంగ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్ ప్రకటించాడు.
- కులభూషణ్ జాదవ్ ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 1987లో చేరారు. ఆ తర్వాత 1991లో ఇండియన్ నేవీలో చేరారు.
- 2001 పార్లమెంటుపై దాడి విచారణలో భాగంగా అతను వెళ్లాడు.
- అతను రిటైర్ అయ్యాక వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో భాగంగా ఇరాన్ వెళ్లారు. ఆయన కుటుంబం కూడా.. కుట్రలో భాగంగా కులభూషణ్‌ను పట్టుకున్నారని ఆరోపిస్తోంది.
- కులభూషణ్ జాదవ్ తండ్రి సుధీర్ జాదవ్ ముంబై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా రిటైర్ అయ్యారు.

ఇదిలా ఉండగా, కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంపై రీసెర్చ్ అండ్ అనలిసిస్ వింగ్ మాజీ అధికారి అమర్ భూషణ్ స్పందించారు. పాకిస్తాన్ వైఖరికి ధీటుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించాలని అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Who is Kulbhushan Jadhav
English summary
It was provocation at its best when Pakistan decided that it would hang an alleged Indian spy, Kulbhushan Jadhav. India has cried foul and even pointed out that at the time of his arrest, no consular access was granted. Not granting consular access itself is something suspicious, India had said.
Please Wait while comments are loading...