వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీక్రెట్ ఏంజెట్ ఎవరు: ట్రంప్‌ ఇబ్బందులకు కారణం ఈ విజిల్ బ్లోవరే..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం కష్ట కాలం ఎదుర్కొంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జూలై 25న మాట్లాడిన ఫోన్‌ సంభాషణల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై దుష్ప్రచారం చేయాలని ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు డెమొక్రాట్లు ఆరోపణలు చేశారు. దీంతో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేముందు విచారణ చేయాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పలోసి ఆదేశించారు. ఇంతకీ ట్రంప్ ఇన్ని ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారంటే అందుకు కారణం ఎవరు..? ట్రంప్ పై సమాచారం ఇచ్చిన విజిల్ బ్లోవర్ ఎవరు..?

ఫిర్యాదు చేసింది సీఐఏ అధికారి

ఫిర్యాదు చేసింది సీఐఏ అధికారి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆధారాలతో సమాచారం ఇచ్చారు ఓ విజిల్ బ్లోవర్. ఈ విజిల్ బ్లోవర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే పురుష ఉద్యోగిగా తెలుస్తోంది. ఆగష్టు 12న తను ఫిర్యాదు చేశారు. గురువారం రోజున తన ఫిర్యాదు పబ్లిష్ కాగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా దర్శనమిస్తోంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిందిగా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు అందులో ఉంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్ జూలై 25న ఫోన్‌ సంభాషణలు జరిపారని ఆ ఫిర్యాదులో విజిల్ బ్లోవర్ పేర్కొన్నారు.

వాదనలకు రుజువులు జతచేసిన విజిల్ బ్లోవర్

వాదనలకు రుజువులు జతచేసిన విజిల్ బ్లోవర్

విజిల్ బ్లోవర్ నివేదిక ప్రకారం 2020 డెమొక్రాట్ల అధ్యక్షఅభ్యర్థి జోబిడెన్, అతని కుమారుడు హంటర్ బిడెన్‌ల వ్యాపార డీలింగ్స్ పై విచారణ చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడినట్లు తెలిపారు. తన వాదనను బలపరుస్తూ విజిల్ బ్లోవర్ ట్రంప్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలకు సంబంధిచిన రికార్డులను సమర్పించారు. ఇదే ఆధారంగా చేసుకుని ట్రంప్‌పై అభిశంసన నోటీసు ఇవ్వాలంటూ డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు.

గతంలో వైట్‌హౌజ్‌లో పనిచేసిన విజిల్ బ్లోవర్

గతంలో వైట్‌హౌజ్‌లో పనిచేసిన విజిల్ బ్లోవర్

ఇక ఆ విజిల్ బ్లోవర్ ఎవరనేది ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తెలుసని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. సీఐఏకు చెందిన పురుష ఉద్యోగి ఆ విజిల్ బ్లోవర్ అని ప్రచురించింది. గతంలో వైట్‌హౌజ్‌లో కూడా తను బాధ్యతలు నిర్వర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. తను వైట్‌హౌజ్‌లో నిత్యం కనిపిస్తూ ఉంటారని పేర్కొంది.

వైట్ హౌజ్‌ను వీడి తిరిగి సీఐఏలోకి...

వైట్ హౌజ్‌ను వీడి తిరిగి సీఐఏలోకి...

సీఐఏలో పనిచేస్తున్న సిబ్బంది దేశ భద్రతకు సంబంధించి పనిచేస్తారు. వైట్‌హౌజ్‌లో వీరు తాత్కాలికంగానే పనిచేస్తారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఒక్కసారి తమ పని పూర్తయ్యాక తిరిగి సీఐఏలో విధులు చేపడతారని వెల్లడించింది. అంతేకాదు శ్వేత సౌధం లోని సమాచార వ్యవస్థపై కూడా వీరు ఓ కన్నేసి ఉంచుతారు. అయితే ట్రంప్ జెలెన్‌స్కీల మధ్య జూలై 25న జరిగిన ఫోన్ సంభాషణల నాటికి ఆ సీఐఏ అధికారి వైట్‌హౌజ్‌ను వీడి సీఐఏలో చేరినట్లు రాసుకొచ్చింది.

కొందరు ఉద్యోగులు సమాచారమిచ్చారు

కొందరు ఉద్యోగులు సమాచారమిచ్చారు

ట్రంప్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు తను సాక్షిని కాదనే చెబుతూ వైట్‌హౌజ్‌లో పనిచేస్తున్న ఇతర సీఐఏ ఉద్యోగస్తులు తమ విధుల్లో భాగంగా తనతో సమాచారం పంచుకున్నారని విజిల్ బ్లోవర్ చెప్పినట్లు నివేదికలో ఉంది. న్యూయార్క్‌ టైమ్స్ విజిల్ బ్లోవర్ గురించి అతను గతంలో నిర్వర్తించిన బాధ్యతల గురించి బయటపెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. చట్టప్రకారం విజిల్ బ్లోవర్‌లు పేరు అతని వివరాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది. అయితే సమాచార హక్కు చట్టం కింద తన వివరాలు బయటకు వెల్లడించొచ్చు అనేది ఉంది. ఎందుకంటే ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు అనేదాన్ని నిర్ధారించేందుకు ఇలా కొన్ని వివరాలను బయటపెడతారు.

English summary
The whistle blower who put the US President at risk is a CIA officer who earlier worked in White house,said sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X