వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పక చదవండి: రంజాన్ మాసంలో జాగ్రత్తలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ విడుదల

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ఈ వైరస్ విశ్వరూపం చూపిస్తున్న సమయంలోనే పలు పండుగలు కూడా వచ్చాయి. ఈ వేడుకలను సంబరంగా జరుపుకునే వీలు లేకుండా పోయింది. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అంతా తమ ఇళ్లల్లో ఉండే పండుగలను జరుపుకున్నారు. ఉగాది, ఈస్టర్ లాంటి పండుగలను ఆయా మతాలవారు ఇళ్లకే పరిమితమై జరుపుకున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రంజాన్ మాసం మరో కొద్ది రోజుల్లో రానుంది. అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి రంజాన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మాసంలో ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉండటంతో పాటు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నమాజ్‌లు చేస్తారు. అయితే ప్రపంచాన్ని కరోనావైరస్ కమ్మేయడంతో రంజాన్ మాసంను ఎలా పాటించాలనేదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది.

రంజాన్ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

రంజాన్ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

రంజాన్ మాసంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది ప్రపంచఆరోగ్య సంస్థ. కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన్ మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ముందుగా ప్రార్థనల కోసం గుంపులు గుంపులుగా ఉండకపోవడం ఉత్తమమైన పని అని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. తమ ఆరోగ్యంను కాపాడుకుంటూ అలానే ఇతరుల ఆరోగ్యం కాపాడుతూ రంజాన్ మాసంను జరపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

* సదాకత్‌ లేదా జకా కార్యక్రమం నిర్వహించే సమయంలో అంతా సామాజిక దూరం పాటించేలా చూసుకోవాలి.

* ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడరాదు. దీని బదులుగా బాక్సుల్లో ప్యాక్ చేసి ఆహారం పంచాల్సిందిగా డబ్ల్యూహెచ్‌ఓ సూచనలు చేసింది.

* ఇక సామూహిక ప్రార్థనలను ఇప్పటికే పలు దేశాల్లో నిషేధం ఉన్నందున ఉన్నచోటనే ఆన్‌లైన్ ద్వారా ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచనలు చేసింది

* ప్రార్థనలకు ముందు ముస్లింలు వుడు అనేది నిర్వహిస్తారు. ఇది శుభ్రతను సూచిస్తుంది. ఈ సమయంలో 70శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్లతో కానీ, లేదా సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలి.

* ఇక ఇతరత్రా వేస్ట్ మొత్తం డస్ట్‌బిన్‌లో వేయడం మరువకూడదని సూచించింది. ప్రార్థనల సమయంలో ప్రత్యేకంగా ఉంచే రగ్గులను కార్పెట్‌పై ఉంచాలని సూచించింది.

 సామాజిక దూరం తప్పనిసరి

సామాజిక దూరం తప్పనిసరి

ఇక సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించిది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కనీసం ఒక వ్యక్తికి మరో వ్యక్తి 1 మీటరు దూరం పాటించాలని కోరింది. అంటే కనీసం మూడడుగుల దూరంలో ఉండాలని సూచించింది. ఇక ఆత్మీయకౌగిలింతలను వీలైనంత వరకు దూరం పెట్టాలని సూచించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్... చేతులు ఊపడం కానీ, గుండెపై చేతులుపెట్టుకుని కానీ అభినందనలు తెలపాలని సూచించింది. రంజాన్‌ మాసంతో ముడిపడి ఉన్న దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా గుమికూడరాదని సూచించింది.

Recommended Video

#TeamMaskForce : Team India Is Now Team Mask Force
 ఉపవాసం, పొగతాగేవారికి...

ఉపవాసం, పొగతాగేవారికి...

రోగనిరోధక శక్తి ఉన్నవారే ఉపవాసం చేయాలని ఇప్పటికే కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారు ఉపవాసాలకు దూరంగా ఉండాలని సూచించింది. డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఉపవాసాలు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రంజాన్ మాసం సమయంలో మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలని అదే సమయంలో వీలైనంత ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని సూచించింది. ఇక పొగతాగే వారు సిగరెట్‌ను మానుకోవాలని సూచించింది. పొగతాగేవారిలో ఇప్పటికే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉంటాయి కనుక... కోవిడ్-19 వారిని సులభంగా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశాలున్నందున మతపెద్దలు ఆయా స్థానిక మతపెద్దలతో మాట్లాడాలని సరైన జాగ్రత్తలు పాటించేలా తమవంతు కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

English summary
There’s five days to go for Ramadan and coronavirus COVID-19 is still here.To ensure the health and safety of all, the World Health Organisation (WHO) has issued a guideline for Muslims on how to practise a safe Ramadan during a pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X