వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్..అలర్ట్... పొగతాగేవారికి కరోనా ముప్పు ఎక్కువ..?: పరిశోధకులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే రోగ నిరోధక శక్తి ఉన్నవారిని వైరస్ ఏమీ చేయలేదు అని వైద్యులు మొదటినుంచి చెబుతున్నారు. అయితే తాజా పరిశోధనలో మరో కొత్త అంశం బయటపడింది. సిగరెట్ తాగేవారికి కరోనా వైరస్ వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందనే కఠోర నిజాన్ని తెలిపారు.

ఇంట్రెస్టింగ్: కరోనా బారిన పడ్డ పిల్లికి ఇచ్చే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందట..!ఇంట్రెస్టింగ్: కరోనా బారిన పడ్డ పిల్లికి ఇచ్చే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందట..!

పొగతాగడం హానికరం..

పొగతాగడం హానికరం..

సాధారణంగానే పొగతాగడం హానికరం. కామన్‌గానే వైద్యులు సిగరెట్ తాగొద్దని సజెస్ట్ చేస్తుంటారు. ఇక కరోనా మహమ్మరి విలయ తాండవం చేస్తోన్న క్రమంలో దమ్ము కొట్టొద్దు అని నిపుణులు తేల్చిచెప్పారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే పొగ.. ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి పాజిటివ్ వస్తే ప్రమాద అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 దెబ్బతింటోన్న అవయవాలు

దెబ్బతింటోన్న అవయవాలు

సాధారణంగానే శరీరంలోని కీలక అవయవాలను వైరస్ దెబ్బతీస్తుంది. ఇక పొగ తాగడం వల్ల దెబ్బతిన్న అవయవాలపై అది చూపే ప్రభావం ప్రాణాంతకం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పొగతాగే అలవాటుతో శరీరం దెబ్బతింటోంది. ఇక కరోనా మహమ్మారిపై పోరాడలేదని తెలిపారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికీ నోరు, వేళ్లకు వైరస్ అంటే అవకాశం కూడా ఉందన్నారు.

సిగరెట్‌కు దూరంగా...

సిగరెట్‌కు దూరంగా...

కరోనా వైరస్ నియంత్రణ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటోన్న.. సిగరెట్‌కు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఒకసారి ధూమపానం మానేస్తే ఆ మరుక్షణం నుంచి శరీరం దెబ్బతిన్న అవయవాలను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇదీ కరోనా మహమ్మరిని ఎదుర్కోవడంలో కీలకమని నిపుణులు వివరించారు.

 దెబ్బతింటోన్న ఊపిరితిత్తులు..

దెబ్బతింటోన్న ఊపిరితిత్తులు..

స్మోకర్లకు వైరస్ సోకితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని నిపుణులు తెలిపారు. ఇదే కాదు కరోనా వైరస్ వల్ల జరిగే మరణాల్లో అధికంగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారే ఉన్నారు. అయితే గుండె, క్యాన్సర్, ఇతర సమస్యలతో బాధపడేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ వ్యాధులన్నీ స్మోకింగ్‌తో సంబంధం ఉన్నవేనని పేర్కొన్నారు.

English summary
who smoke in frequently.. they are threatened to virus scientists revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X