వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

stop..కోవిడ్‌ రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో క్లినికల్ ట్రయల్స్ వద్దు: డబ్ల్యుహెచ్‌వో

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనిచేస్తుందని.. తాను వాడి చూశానని పేర్కొన్నారు. 15 రోజులు వాడాక తనలో కొత్త ఉత్సహం కనిపిస్తోందని తెలిపారు. బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి కూడా కోవిడ్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో పాటు క్లోరోక్విన్ చక్కగా పనిచేస్తుందని వివరించారు. అయితే వీరి వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చింది. కరోనా వైరస్ సోకిన వారు వాడటమే కాదు క్లినికల్ ట్రయల్స్ కూడా నిలిపివేస్తున్నట్టు తేల్చిచెప్పింది.

 WHO Stops Trial Of Anti-Malarial Drug For COVID-19..

కోవిడ్ సోకిన రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వొద్దని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన వారికి మాత్రలు ఇస్తే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించింది. లాన్సెట్ నివేదిక వచ్చాక అన్నిదేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించొద్దని సోమవారం డబ్ల్యూహెచ్ వో చీప్ టెడ్రోస్ ఆదేశాలు జారీచేశారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కరోనాకు పనిచేస్తుందనే ప్రచారంతో.. ప్రపంచంలో వందలాది ఆస్పత్రులు క్లినికల్ ట్రయల్స్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాయని తెలిపారు. కానీ దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. ట్రంప్, ఇతరుల వల్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో వైరస్ సోకిన వారికి క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు ముందుకొచ్చారని.. అయితే ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోందని డబ్ల్యు హెచ్ వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు.

English summary
World Health Organization said Monday it had "temporarily" suspended clinical trials of hydroxychloriquine as a potential treatment for COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X