కొవిడ్-19 షాకింగ్: రెమ్‌డెసివిర్ వాడొద్దు -పీక్యూ జాబితా నుంచి తొలగింపు -WHO కీలక ప్రకటన
కొవిడ్-19 చికిత్సకు ప్రస్తుతం వాడుతోన్న మందులకు సంబంధించి ప్రంపచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. యాంటీవైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ ను ఇకపై కరోనా చికిత్సకు వాడొద్దని స్పష్టం చేసింది. కొవిడ్-19 చికిత్సలో వాడే మందులకు సంబంధించిన పీక్యూ (ప్రీక్వాలిఫికేషన్) జాబితా నుంచి రెమ్‌డెసివిర్ ను తొలగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది.
కొవిడ్-19 వ్యాక్సిన్: మరో 10 రోజుల్లో -'ఎమర్జెన్సీ యూజ్' కోసం ఫైజర్ అభ్యర్థన -ఎఫ్‌డీఏ ఓకే చెప్పేనా?

డబ్ల్యూహెచ్ఓ ప్రకటన..
కరోనా విలయం తలెత్తిన తొలినాళ్లలో మరణాలు, కేసులు విపరీతంగా ఉండటం, అప్పటికి కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభం కాకపోవడంతో.. ఎబోలా వైరస్ ను నియంత్రించిన రెమ్‌డెసివిర్ ఔషధాన్ని.. కొవిడ్-19 చికిత్సలోనూ వాడొచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో 50కిపైగా దేశాలు ఆస్పత్రిలో చేరిన కొవిడ్ రోగులకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తూ వచ్చాయి. కానీ కొంతకాలానికే పరిస్థితి తిరగబడింది. కోవిడ్-19పై రెమ్‌డెసివిర్ పెద్దగా ప్రభావం చూపడంలేదని, రికవరీ రేటు, వెంటిలేటర్ అవసరాన్ని తగ్గించడంలో అది ఆశాజనక ఫలితాలను ఇవ్వడం లేదని మళ్లీ డబ్ల్యూహెచ్ఓనే ప్రకటించింది. అయినాసరే చాలా దేశాలు ఇప్పటికీ రెమ్‌డెసివిర్ ను వాడుతుండటంతో తాజాగా సస్పెన్షన్ ఆదేశాలను జారీ చేసింది..

జాబితా నుంచి రెమ్‌డెసివిర్ తొలగింపు..
వివిధ దేశాల్లో ఆసుపత్రిలో చేరిన కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా అందించాల్సిన మందులపై డబ్ల్యూహెచ్ఓ.. ‘పీక్యూ(ప్రీక్వాలిఫికేషన్) జాబితాను రూపొందించింది. ఇప్పుడా జాబితా నుంచి రెమ్‌డెసివిర్ ను తొలగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి తారీఖ్ జసారెవిక్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా అన్ని దేశాలూ ఇకపై కొవిడ్ చికిత్సలో రెమ్‌డెసివిర్ వాడకాన్ని నిలిపేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నట్లు తారీఖ్ పేర్కొన్నారు. తక్కువ, మధ్యస్త ఆదాయం కలిగిన దేశాలకు ఏ అంతర్జాతీయ కొనుగోలుదారులు మందులు అందిస్తున్నారన్న విషయం డబ్బ్యూహెచ్ఓకి తెలీదని ఆయన చెప్పడం గమనార్హం.

ఇప్పటికే కొన్నవాళ్లు మునిగినట్లే..
రెమ్‌డెసివిర్ వాడకానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ చేసిన, చేస్తున్న ప్రకటనలపై మొదటి నుంచి వివాదం కొనసాగింది. ఎబోలా వైరస్ కు మందుగా అమెరికాకు చెందిన గిలాడ్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్ ను ప్రీక్యూ జాబితాలోకి చేర్చడంపై ప్రముఖ సైంటిస్టులు, డాక్టర్లు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం ఉండటంతో పలు దేశాలు పెద్ద ఎత్తున డోసుల్ని కొనుగోలు చేశాయి. ఇండియాలోనూ పలు రాష్ట్రాలు లక్షల సంఖ్యలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం ఆర్డర్లు పెట్టాయి. తాజాగా కొవిడ్ మందుల జాబితా నుంచి రెమ్‌డెసివిర్ ను తొలగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ప్రకటించడంతో ఇప్పటికే ఆ మందును కొనుగోలు చేసినవారి పరిస్థితి డోలాయమానంగా తయారైంది.
జగన్‌కు సెగ గడ్డలా నిమ్మగడ్డ -కుక్క అనడం కొడాలి నాని తప్పుకాదు :ఎంపీ రఘురామ అనూహ్యం