వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: మాస్క్‌ల వాడకంపై WHO వార్నింగ్.. ఇప్పటికే దాని తీరుపై అభ్యంతరాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించకంటే ముందు నుంచే మాస్క్‌ల వాడకంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. అదేసమయంలో మాస్క్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విస్తృత ప్రచారం తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోనే వైరస్ వ్యాప్తి తగ్గుతుందని తెలియవచ్చింది. మరోవైపు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులెవరూ మాస్క్ వాడాల్సిన అవసరం లేదని, ఎప్పుడైతే కొవిడ్-19 లక్షణాలు కనిపించాయో అప్పటి నుంచి కచ్చితంగా మాస్క్ వాడాలని, కొవిడ్-19 రోగులను కలిసినప్పుడు కూడా మాస్క్ ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సూచించింది. అంతేకాదు,

మాస్క్‌లపై గతంలో ఏం చెప్పారంటే..

మాస్క్‌లపై గతంలో ఏం చెప్పారంటే..


సోషల్ డిస్టెన్స్, చేతులు కడుక్కోవడం లాంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం మాస్కు ధరించినంత మాత్రాన వైరస్ దరిచేరదని అనుకోవడం చాలా తప్పని, మాస్కులతో మాత్రమే వైరస్ వ్యాప్తిని ఆపలేమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ పలు మార్లు ప్రకటనలు చేశారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే WHO సూచనలో లోపాలున్నాయని, అందరూ మాస్కులు వాడాల్సిన అవసరంలేదని చెప్పడం తప్పేనని కొన్ని అధ్యయన సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

వాటితోనే గట్టెక్కారు..

వాటితోనే గట్టెక్కారు..

ఆరోగ్యానికి సంబంధించి WHO చేసే ప్రతి చిన్న సూచనను అన్ని దేశాలు సీరియస్ గా తీసుకుంటాయని, అయితే మాస్క్‌ల విషయంలో మాత్రం సంస్థ తీరు సరిగా లేదని అన్ని ప్రముఖ పత్రికల్లో రీసెర్చర్లు వ్యాసాలు రాశారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాస్క్ వాడాల్సిన అవసరంలేదన్న సూచనను వాళ్లు విమర్శించారు. చైనా పక్కనే ఉన్న హాంకాంగ్, మంగోలియా, దక్షిణ కొరియా వంటి దేశాలు సోషల్ డిస్టెన్స్ తోపాటు మాస్కుల వాడటం వల్లే గండం నుంచి గట్టెక్కారని, ఆరోగ్యవంతుడైన వ్యక్తి.. వైరస్ నుంచి తప్పించుకోడానికైనా మాస్క్ రక్షణ కవచంలా పనిచేస్తుందని అధ్యయనకర్తలు చెప్పారు. మాస్క్ లను విరివిగా వాడనందుకే అమెరికా, యూరప్ దేశాల్లో వైరస్ విజృంభించిందని పేర్కొన్నారు.

మళ్లీ క్లారిటీ ఇచ్చిన WHO

మళ్లీ క్లారిటీ ఇచ్చిన WHO

మాస్క్ ల విషయంలో గతంలో తాము చేసిన సూచనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ప్రంపచ ఆరోగ్య సంస్థ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ‘‘సిల్వర్ బుల్లెట్ తో టార్గెట్ ను పేల్చినంత కచ్చితంగా.. ముఖాలకు ధరించే మాస్క్ లు మనల్ని కరోనా వైరస్ బారి నుంచి కాపాడలేవు. దాన్నొక ప్రత్యేక సాధనంగానే తప్ప సంపూర్ణ పరిష్కారంగా చూడొద్దు. ఇంతకుమించి మాస్క్ వాడకంపై కచ్చితమైన సమాధానాలు లేవు'' అని WHO చీఫ్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ సోమవారం వెల్లడించారు.

Recommended Video

US Economy To Shrink At Fastest Rate Since 1946, Unemployment Rise
హోం మేడ్ మాస్క్ బెటరన్న కేంద్రం..

హోం మేడ్ మాస్క్ బెటరన్న కేంద్రం..


మాస్క్ వాడకంపై WHOతో కొంత మంది రీసెర్చలు వాదులాడుతుండగానే.. మెజార్టీ ప్రజలు మాస్క్ ధరించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. అయితే యూజ్ అండ్ త్రో మాస్క్ ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్న నేపథ్యంలో ఇంట్లో తయారుచేసిన కాటన్ మాస్క్ లు బెస్టని, వాడిన తర్వాత సబ్బుతో శుభ్రంగా ఉతికి, మళ్లీ వాడుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక సూచన చేసింది.

English summary
"Masks should only ever be used as part of a comprehensive package of interventions says WHO director-general Tedros Adhanom Ghebreyesus told a virtual news conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X