వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది..? జ్యోతిష్కులు తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అటు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ల మధ్య వాడీవేడీ డిబేట్లు కూడా ముగిశాయి. కరోనావైరస్ అంశంతో పాటు చైనా, ఇతర జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య హీటెడ్ డిబేట్ జరిగింది. ఇక ఓటర్లు కూడా తమ ఓటును ఎవరికి వేయాలనేదానిపై ఫిక్స్ అయి ఉన్నారు. ఈ లోపే సర్వేల సందడి కూడా ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో జో బిడెన్‌కు అనుకూలంగా ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. గ్రహాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయ చర్చ జరుగుతోంది.

 తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?

తత్వవేత్తలు ఏం చెబుతున్నారు..?


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఇప్పుడు ఇదే అంశంపై అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అగ్రరాజ్యంతో ఇతర దేశాలకు చాలా మంచి సంబంధాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని కొందరు లేదు జో బిడెన్‌ విజయం సాధిస్తారని మరికొందరు పందాలు మీద పందాలు కాస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు సైకాలజిస్టులు మాత్రం ట్రంప్‌కు ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదని చెబుతున్నారు. జో బిడెన్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు పాపులారిటీ కూడా ట్రంప్‌ కంటే బిడెన్‌కే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే జ్యోతిష్కుల వాదన మాత్రం మరోలా ఉంది.

ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న సంఖ్యలు

ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న సంఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. ట్రంప్‌ సంఖ్యాబలం బలంగా ఉండటం ట్రంప్‌కు అంకెలు కలిసి రావడంతో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని చెబుతున్నారు. అతిక్లిష్టమైన గణితం లెక్కల ద్వారా , కొన్ని సమీకరణాలను అంచనా వేసి ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కాబోతున్నారని సంఖ్యాశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ట్రంప్ డెస్టినీ నెంబర్ 22 అని ఈ సంఖ్య ఉన్నవారు పలు భారీ విజయాలను నమోదు చేయడమే కాకుండా వారనుకున్న ప్రణాళికను అమలు చేస్తారని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!
 బలహీనంగా కనిపిస్తున్న బిడెన్ సంఖ్య

బలహీనంగా కనిపిస్తున్న బిడెన్ సంఖ్య


ఇక జో బిడెన్ విషయానికొస్తే ఆయనది రెండవ సంఖ్య అని ఇది చాలా బలహీనమైన సంఖ్యగా చెబుతున్నారు. ఈ సంఖ్య ఉన్నవారు ఎంత కష్టపడినప్పటికీ, అంకిత భావంతో పనిచేసినప్పటికీ అనుకున్న ఫలితాలు మాత్రం రావని చెబుతున్నారు. ఇక ట్రంప్‌కు 2020 మాస్టర్ ఇయర్‌గా చెబుతున్న న్యూమరాలజిస్టులు ట్రంప్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని జోస్యం చెబుతున్నారు. గ్రహాలన్నీ ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నాయని కచ్చితంగా చెబుతున్నారు.

మొత్తానికి కరోనావైరస్‌పై పోరులో అమెరికా ప్రభుత్వం విఫలమైందని ఇది ట్రంప్‌కు పెద్ద దెబ్బగా నిలుస్తుందని వాదిస్తున్న వారికి న్యూమరాలజిస్టులు చెబుతున్న ఫలితాలు ఇంపుగా లేవు. అయితే ఉద్యోగాల పరంగా ముందుగా అమెరికన్లకే అని ట్రంప్ నినదిస్తుండటంతో యువత అతని వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

English summary
Numerologists Predict Donald Trump will come back to White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X