వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు కథ ముందుంది.. కశ్మీర్‌లో కర్ఫ్యూ సడలింపు తర్వాత పరిస్థితిపై ప్రపంచం చూస్తోంది :ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

కేంద్రబలగాల ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఇప్పుడు బాగానే ఉంది, అసలు విషయం ముందుంది అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. అంటే ప్రస్తుతం కేంద్ర బలగాల ఆదీనంలో కశ్మీర్ ఉండగా గత రెండు రోజులుగా కర్ఫ్యూ వాతవరణం కొనసాగుతోంది. అయితే కర్ఫ్యూ తొలగించిన తర్వాత జరిగే పరిణామాలపైనే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశాడు.

జమ్ము కశ్మీర్‌లో పరిణామాలపై పాకిస్థాన్ ఎప్పుడు అవకాశం దోరుకుందా అని ఎదురు చూస్తోంది. కశ్మీర్‌‌లో ఆర్టికల్ తొలగింపు తర్వాత ఊహించని పరిణామాలు జరుగుతాయని అంతా ఊహించారు. కాని ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రం చర్యలు చేపట్టింది.పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించింది. ఈ నేఫథ్యంలోనే రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. దీంతో ఎలాంటీ హింసాయుత పరిణామాలు చేటుచేసుకోలేదు.

Whole world is waiting to see what happens ofter curfew lifted:Imran Khan

అయితే ఎవ్వరు ఊహించని విధంగా పాకిస్థాన్‌లో పరిస్థితులు మారాయి. కాని ఇదంతా రాష్ట్రం మొత్తం పోలీసుల దిగ్భంధనంలోకి వెళ్లడం వల్ల పాకిస్థాన్ మద్దతుదారులతో పాటు ఉగ్రవాదులు సైతం ఎలాంటీ సంఘటనలకు పాల్పడకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కశ్మీర్ పరిణామాలను క్షుణ్ణంగా పరీశీలిస్తున్న పాకిస్థాన్‌కు, ఈ పరిణామాలు రుచించడం లేదు. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించి పలు నిబంధలను విధించింది. అనంతరం రెండు దేశాల మధ్య రాయబారులను సైతం బహిష్కరించింది.

అయితే కర్ఫ్యూ తొలగించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటుందనే ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఇదే అవకాశాన్ని పాకిస్థాన్ కూడ వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ఫూ తొలగించిన తర్వాత అసలు విషయం తెలుస్తోందనే అలోచనలో పాకిస్థాన్ ఉంది. అప్పుడు ప్రజల ఆందోళనలు బట్టి రంగంలోకి దిగాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్ఫూ సడలించిన తర్వాత జరిగే పరిణామాలపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయన ట్వీట్ చేశాడు. బీజేపీ ప్రభుత్వం భద్రతా దళాలు మోహరించి తమ విజయంగా భావిస్తున్నాయని ట్విట్టర్‌లో పేర్కోన్నారు.

English summary
Whole world is waiting to see what happens ofter curfew lifted,said pakistan prime minister Imran Khan,Imran Khan on jammu and kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X