• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వ్యాక్సీన్ వేయించుకునేందుకు భారతీయులు నేపాల్‌ ఎందుకు వెళ్తున్నారు

By BBC News తెలుగు
|

నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో టేకు ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది.

గత బుధవారం కోవిడ్ టీకా తీసుకునేందుకు వచ్చిన కొందరి దగ్గర పెద్ద పెద్ద సూట్‌కేసులు, పెద్ద ఎత్తున లగేజీ కనిపించింది.

అది చూసి ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Coronavirus

"గుర్తింపు కార్డులు చూపించమని వారిని అడిగితే, ఇండియన్ పాస్‌పోస్టులు చూపించారు" అని ఆ ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.

"వాళ్లతో మాట్లాడిన తర్వాత కోవిడ్ వ్యాక్సీన్‌ను ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారని మాకు తెలిసింది. మేము వారికి టీకా ఇవ్వబోమని చెప్పాం. దాంతో వాళ్లు మాతో వాగ్వాదానికి దిగారు. చాలా మంది మాపై రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు" అని ఆస్పత్రి డైరెక్టర్ సాగర్ రాజ్ భండారీ బీబీసీతో చెప్పారు.

'చైనా వ్యాక్సీన్ కోసం నేపాల్‌కు భారతీయులు'

చైనాలో తయారైన వ్యాక్సీన్ వేసుకున్న వారికే వీసాలు ఇస్తామని చైనా నిబంధన పెట్టిందని నేపాల్‌లోని చైనీస్ ఎంబసీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

చైనా కంపెనీలతో వ్యాపారం చేస్తున్న భారతీయ వ్యాపారస్తులు చైనాలో తయారైన టీకా వేయించుకునేందుకు తమ దేశం వస్తున్నారని నేపాల్ అధికారులు అనుమానిస్తున్నారు.

భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు తయారవుతున్నాయి. తాజాగా రష్యా వ్యాక్సీన్ స్పుత్నిక్ వీకి కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, భారత్‌లో ప్రస్తుతం 45 సంవత్సరాలు ఆపైన వయసు ఉన్న వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు.

"ఈ మధ్య కాలంలో భారత్‌ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరిగింది" అని కాఠ్‌మాండూలోని త్రిభువన్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి దేవ్ చంద్ర లాల్ కర్నా చెప్పారు.

"పర్యటకులు నేపాల్‌ నుంచి మరో దేశానికి వెళ్లే వెసులుబాటు ఇక్కడ ఉంది. అయితే, దానికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (NOC) అవసరం ఉంటుంది. ప్రస్తుతం చాలామంది భారతీయ పర్యటకుల దగ్గర అలాంటి సర్టిఫికెట్లు ఉన్నాయి" అని ఆయన వివరించారు.

ప్రస్తుతం భారత్- నేపాల్ మధ్య ఒకే ఒక్క విమానయాన సంస్థ సేవలు అందిస్తోంది. అలాగే నేపాల్ - చైనా మధ్య కూడా విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

కాఠ్‌మాండూలోని ఇండియన్ ఎంబసీలో గత కొన్ని రోజులుగా ఇలాంటి ఎన్‌వోసీలు పెరిగాయి.

40 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికి మార్చి 31 నుంచి ఏప్రిల్ 19 వరకు నేపాల్‌లో వ్యాక్సీన్ వేస్తున్నారు.

దీంతో పాటు.. ఉద్యోగాలు, వ్యాపారం, కుటుంబ కారణాలు లేదా చికిత్స కోసం చైనా వెళ్లే వారికి కూడా నేపాల్‌లో వ్యాక్సీన్ వేస్తున్నారు.

చైనా యూనివర్శిటీల్లో చదువుకుంటున్న నేపాలీ విద్యార్థులకు కూడా టీకా ఇస్తున్నారు.

మొదటి 10 రోజుల్లో 50వేల మందికి టీకా ఇచ్చామని నేపాల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

"గతంలో గుర్తింపు కార్డులు చూపించాలని మేం ప్రజలను అడిగాం. ఇప్పుడు గుర్తింపు కార్డులను వెరిఫై చేయాలని కూడా జిల్లా వైద్యాధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తున్నాం" అని నేపాల్ వైద్యశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ సమీర్ కుమార్ అధికారి చెప్పారు.

అయితే, నేపాల్‌లో నివసిస్తున్న భారతీయులకు, నేపాల్‌లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కూడా టీకా ఇస్తామని ఆ దేశ అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why are Indians going to Nepal to get the Chinese vaccination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X