వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా సెనేటర్ భార్యకు మోడీ క్షమాపణ.. ఇంతకీ సారీ ఎందుకంటే!!! (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెరికా సెనేటర్ భార్యకు మోడీ సారీ.. ఎందుకో తెలుసా..!!! (వీడియో)

హౌడీ మోడీ సభతో హ్యుస్టన్ మారుమోగింది. భారత ప్రధాని మోడీ, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్.. సెనేటర్లు, అతిరథ మహారథులు హాజరుకాగా .. దాదాపు 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఓ విచిత్రం జరిగింగి. సాక్షాత్ ప్రధాని మోడీ .. అమెరికా సెనేటర్ భార్యకు క్షమాపణ చెప్పారు. అదీ కూడా ఓ వీడియోలో .. ప్రధాని మోడీ సారీ చెప్తుండగా .. సెనేటర్ కూడా పక్కనే ఉండటం విశేషం.

ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

అమెరికా పర్యటన కోసం యూఎస్ వెళ్లిన మోడీ .. హ్యుస్టన్‌లో హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధినేత ట్రంప్‌తో కలిసి వేదికను పంచుకొన్నారు. అయితే అంతకుముందు నేటర్ జాన్ కార్నివర్ భార్య శాండీకి మోడీ క్షమాపణ చెప్పారు. తన కార్యక్రమానికి హాజరైతే కృతజ్ఞతలు చెప్పాలి కదా.. సారీ చెప్పడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? అవును మోడీ నిజంగానే సారీ చెప్పారు. ఎందుకు క్షమాపణ చెప్పారో వివరించారు కూడా.

బర్త్ డే కదా ..

బర్త్ డే కదా ..

ఆదివారం జాన్ భార్య పుట్టినరోజు. ఆ రోజు ఆమె 60వ ఏట అడుగిడారు. ఎవరైనా సాధారణంగా సెలబ్రేషన్స్ ఇంటి వద్ద ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకోవాలని భావిస్తారు. అయితే హౌడీ మోడీ సభ వల్ల జాన్ .. భార్యతో గడపలేకపోయారు. విషయం తెలుసుకున్న మోడీ .. తనదైనశైలిలో స్పందించారు. జాన్‌తో కలిసి ఓ వీడియోలో మాట్లాడారు. హ్యాపీ బర్త్ డే, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

జలసీ కామనే...

జలసీ కామనే...

బర్త్ డే రోజున భర్త ఇంట్లో లేకపోతే ఎవరికైనా కోపం వస్తోంది. ఆ విషయం నాకు తెలుసు అని మోడీ పేర్కొన్నారు. మీకు నేనంటే జాలసీ కూడా కలిగి ఉండొచ్చని తెలిపారు. మోడీ వీడియోలో మాట్లాడుతున్నంత సేపు .. జాన్ పక్కనే ఉన్నారు. జాన్-సాండీ దంపతులకు 40 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూమార్తెలు కూడా ఉన్నారు.

వీడియో వైరల్

జాన్ ప్రస్తుతం టెక్సాస్ సెనేటర్‌ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హ్యుస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ సభ కోసం రిపబ్లికన్, డెమోక్రటిక్ నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది భారత సంతతికి చెందిన అమెరికన్లు అటెండయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత మోడీ సెనేటర్ భార్యకు క్షమాపణ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది.

English summary
Indian Prime Minister Narendra Modi apologised to Senator John Cornyn's wife as on her birthday the US lawmaker was attending the Indian leader's mega diaspora 'Howdy Modi!' event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X