వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బి: టెక్కీలను నిరాశ పరిచిన మోడీ, ఛాన్స్ మిస్

మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో హెచ్1బి వీసాల కొత్త నిబంధనలపై శుభవార్త వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో హెచ్1బి వీసాల కొత్త నిబంధనలపై శుభవార్త వస్తుందని ఐటీ కంపెనీలు, టెక్కీలు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయని అంటున్నారు.

అమెరికాలో ఆసక్తికరం: మోడీ భార్య కోసం డోర్ తెరిచి..?అమెరికాలో ఆసక్తికరం: మోడీ భార్య కోసం డోర్ తెరిచి..?

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధాని మోడీ ఇద్దరూ తొలిసారి ముఖాముఖిగా భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకుని సంయుక్త సమావేశం కూడా నిర్వహించారు.

ప్రధాని మోడీ తీరు నిరాశ కలిగించిందంటూ..

ప్రధాని మోడీ తీరు నిరాశ కలిగించిందంటూ..

కానీ ఈ సమావేశం భారతీయ వ్యాపారస్తులను, కంపెనీలకు, హెచ్1బీ వారికి ఏ మాత్రం ఆకర్షణీయంగా అనిపించలేదు. ముఖ్యంగా ప్రధాని వ్యవహరించిన తీరు నిరాశ కూడా కలిగించిందంటున్నారు. అమెరికా కంపెనీలకు వాణిజ్యమైన ఆటంకాలు తొలగించాలంటూ ట్రంప్ నేరుగా వారి డిమాండ్లను ప్రస్తావించినప్పటికీ, మోడీ మాత్రం భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలు హెచ్1బీ వీసాతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేవనెత్తలేదని అంటున్నారు.

మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారని..

మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారని..

అంతేకాక వారి నుంచి డైరెక్ట్ డిమాండ్ వచ్చినప్పుడు, మనవాళ్లు మాత్రం మన సమస్యలను ఎత్తకపోవడం మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లేనని అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వనరుగా ఉన్న ఐటీ రంగానికి ఇది బాధకరమేనని పేర్కొంటున్నారు.

తమకు జవాబు ఉందని ముందే వైట్ హౌస్

తమకు జవాబు ఉందని ముందే వైట్ హౌస్

మోడీ-ట్రంప్ భేటీలో హెచ్1బీ వీసా విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశమే లేదని, ఒకవేళ వచ్చినా తమ వద్ద సరైన జవాబు ఉందని మోడీ పర్యటనకు వెళ్లకముందే శ్వేత సౌధం ఓ ప్రకటన చేసింది.

మోడీ ప్రస్తావిస్తారని..

మోడీ ప్రస్తావిస్తారని..

కానీ మోడీ కచ్చితంగా ఈ విషయంపై ప్రస్తావించి, ఐటీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే వార్తను తెస్తారని తెగ ఆశలు పెట్టుకున్నారు. ఈ భేటీలో హెచ్1బీ వీసాల సమస్యపై ఓ క్లారిటీ రావచ్చని కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మోడీ మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారంటున్నారు.

English summary
High profile meetings of world leaders are normally characterised with photo ops, exchange of antiques and mundane statements that are more generic in nature and less specific on the issues at the moment. Major bilateral decisions — economic or diplomatic — are rarely announced on such occasions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X