• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19ను మనం నోరోవైరస్‌లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్‌ లక్షణాలు ఏమిటి?

By BBC News తెలుగు
|
ఫ్లూ

కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, నొప్పులు వంటివన్నీ సాధారణ ఫ్లూ లక్షణాలుగానే కనిపిస్తాయి.

'ఫ్లూ విషయంలో వ్యవహరించినట్లే మేం కోవిడ్‌ను ఎదుర్కోవడానికీ మార్గాలు కనుగొనాలి'' అని బ్రిటన్ కొత్త ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ ఇటీవల అన్నారు.

కానీ, ఈ పోలిక సరికాదనిపిస్తోంది. కోవిడ్-19 వంటి మహమ్మారిని ఒక సాధారణ సీజనల్ వ్యాధితో పోల్చుతున్నాం.

సీజనల్‌గా వచ్చే ఫ్లూ ఎవరికైనా రావొచ్చు. అయితే, దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న వ్యక్తులు, న్యుమోనియా వంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు గురయ్యేవారికి మాత్రమే ఫ్లూ వ్యాక్సీన్ వేస్తారు.

మిగతావారికి ఫ్లూ వచ్చినా మందులు వేసుకుని తగ్గించుకుంటారు. ఫ్లూ వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మరణిస్తున్నారు.

ఫ్లూ

కానీ కోవిడ్ అలా కాదు. కోవిడ్‌తో సహజీవనం చేసే పరిస్థితీ లేదు.

2020 ప్రారంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాదు.. దీర్ఘకాల కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఎవరికీ ఇంకా తెలియదు. కానీ, దీని లక్షణాలు కొనసాగడం మాత్రం ఉంటోంది.

కోవిడ్ సోకిన వారిలో ప్రతి పది మందిలో ఒకరు వైరస్ సోకిన 12 వారాల తరువాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ప్రపంచ జనాభాపై కోవిడ్ వల్ల పడిన ఆరోగ్య ప్రభావం ఫ్లూ కంటే చాలా ఎక్కువ.

కోవిడ్-19 సంక్రమణ శక్తి చాలా ఎక్కువ. గత ఏడాదిన్నర కాలంలో కోవిడ్ నియంత్రణకు చేపట్టిన కఠిన చర్యల వల్ల ఫ్లూ భారీగా తగ్గింది. ఇంకా చెప్పాలంటే ఫ్లూ కేసులు ఇప్పుడు దాదాపు లేవు.

దక్షిణార్థగోళంలో 2020 చలికాలంలో ఫ్లూ కేసులు దాదాపు లేవు. అలాగే 2020 నవంబరు, 2021 మార్చి మధ్య యూరప్, ఉత్తర అమెరికాలలోనూ ఫ్లూ కేసులు నమోదు కాలేదు.

అంతేకాదు.. కోవిడ్ కేసుల రేటు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లో కూడా ఫ్లూ కేసుల నమోదు చాలా తక్కువగా ఉంది.

కరోనావైరస్

ఫ్లూను ఎదుర్కోవడానికి ఉపయోగించే సాధారణ పద్ధతుల ప్రభావం కోవిడ్-19పై వేరేగా ఉంటుందని ఇవన్నీ సూచిస్తున్నాయి.

కోవిడ్‌కు ఫ్లూ లాగా చికిత్స చేస్తే కేసులు, మరణాలు పెరిగిపోతాయి. అంతేకాదు.. సాధారణ ఇన్‌ఫ్లుయెంజా కంటే ఎక్కువ కాలం వ్యాధి పీడిస్తుంది.

మరో వైరస్‌తో పోలిక

కోవిడ్-19 వ్యాధికి కారణమైన SARS-CoV-2 వైరస్‌కు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల లక్షణాలకు పోలికలుంటాయి. SARS-CoV-2 సోకినవారిలో 20 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఫ్లూ వైరస్‌లు సోకినవారిలోనూ చాలామందికి అనారోగ్యమేమీ కలగదు.

రెండు వైరస్‌లు మ్యుటేట్ అవుతాయి.

రెండు వైరస్‌లు కూడా బలహీనంగా ఉండేవారు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఈ రెండింటి లక్షణాలు మరో వైరస్‌ లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. అది నోరోవైరస్.

నోరోవైరస్ సోకినవారిలోనూ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.

ఈ నోరోవైరస్ కూడా విపరీతంగా మ్యుటేట్ అవుతుంటుంది. ఎంతగా అంటే, సీజన్‌లో ఒకే హాస్పిటల్‌లో వేర్వేరు నోరోవైరస్ మ్యుటేషన్లు కనిపిస్తాయి.

అంతేకాదు... నోరోవైరస్‌ను గుర్తించే సాధారణ టెస్టింగ్ కిట్‌లు ఒక్కోసారి దీని మ్యుటెంట్ వేరియంట్లను గుర్తించలేవు.

వాంతులు

నోరోవైరస్ లక్షణాలు ఏమిటి?

నోరోవైరస్ సోకినవారిలో ఎక్కువ మంది డయేరియాతో బాధపడతారు. కొందరికి వాంతులు కూడా అవుతాయి. అందువల్ల ఈ వైరస్ వివిధ ఉపరితలాలపై చేరి ఇతరులకు సోకుతుంది.

కోవిడ్ వల్ల కూడా కొందరికి విరేచనాలవుతాయి. కాబట్టి కోవిడ్‌తో ఒక్క ఫ్లూనే కాదు నోరోవైరస్‌కూ పోలికలున్నాయి.

తేడాలూ ఉన్నాయి..

అదేసమయంలో SARS-CoV-2, నోరోవైరస్ మధ్య చాలా తేడాలు కూడా ఉన్నాయి.

మరోవైపు వ్యాక్సినేషన్, ఇతర నియంత్రణ విధానాల వల్ల కరోనావైరస్ చాలా చోట్ల అదుపులోకి వచ్చింది.

కేసులు తగ్గుతుండడంతో నియంత్రణలూ తగ్గుతున్నాయి. కాబట్టి మళ్లీ వైరస్ ప్రబలే ప్రమాదం అంతేస్థాయిలో ఉంటుంది. మరికొన్నేళ్ల పాటు కరోనావైరస్ ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేసుకోవాలి.

చేతులు శుభ్రం చేసుకోవడం

నోరోవైరస్ నియంత్రణ ఇలా..

సాధారణంగా నోరోవైరస్ సోకినవారిని ఇతరులకు దూరంగా ఉంచుతారు.

ఒకవేళ ఈ వైరస్ సోకిన రోగుల పిల్లల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తే వారిని స్కూలుకు పంపించొద్దని వైద్యులు చెబుతారు.

ఆసుపత్రులలోనూ నోరోవైరస్ రోగులను మిగతా వారితో కాకుండా వేరే గదుల్లో ఉంచి చికిత్స చేస్తారు.

వీరికి చికిత్స చేసే ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్‌లు ధరిస్తారు.

ఆ ప్రాంతంలోని అన్ని ఉపరితలాలను.. అంటే, నేల, గచ్చు, టేబుళ్లు వంటివన్నీ తరచూ శుభ్రం చేస్తూ వైరస్ లేకుండా చూస్తారు.

కాబట్టి కోవిడ్‌తో సహజీవనం చేయడమనేది నోరోవైరస్‌తో సహజీవనం చేసేదిలా ఉండాలి. ఫ్లూ మాదిరిగా దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.

కోవిడ్ వల్ల తప్పనిసరిగా మారిన పరిశుభ్రతా అలవాట్లను అందరూ ఎల్లకాలం కొనసాగించడమనేది చాలా వైరస్‌ల నియంత్రణకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why should we see Covid-19 as a norovirus? What are the actual symptoms of norovirus?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X