వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో నరమేధం: 7 ఏళ్ళలో 4 లక్షల మంది మృత్యువాత

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిరియా: సిరియాలో ఏడేళ్ళనుండి కొనసాగుతున్న అంతర్యుధ్దంలో సుమారు 4 లక్షల మంది చంపివేయబడ్డారు. చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో హత్యకు గురైన ఘటన ఇటీవలి కాలంలో ఇదే కావడం గమనార్హం.

సిరియాలో కొంత కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్దం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.అధ్యక్షుడు అసద్‌ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్‌ దళాలతో పోరుసాగిస్తున్నాయి.

Why the war in Syria is hotting up

సిరియా రాజధాని డమస్కస్ పరిధిలోని గౌటాలో 2013లో ఉగ్రవాదులు ప్రవేశించారు. జనాల్లో కలిసిపోయి 2017 వరకు తమ బలాన్ని పెంచుకొన్నారు. భారీగా ఆయుధాలను సమకూర్చుకొన్నారు. ఇటీవల కాలం వరకు ప్రభుత్వ అధీనంలో ఉన్న అక్కడి నగరం ఒక్కసారిగా ఉగ్ర మూకల చేతుల్లోకి వెళ్లింది.

అయితే ప్రభుత్వం, తిరుగుబాటుదార్ల మధ్య పోరులో అమాయకులైన ప్రజలు సమిధులుగా మారుతున్నారు. ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయనే పేరుతో ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడులు చేయడంతో సామాన్యులు ఎక్కువగా సమిధలుగా మారుతున్నారు.

సిరియాలో కొంత కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్దం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.అధ్యక్షుడు అసద్‌ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్‌ దళాలతో పోరుసాగిస్తున్నాయి.

సిరియాలోని అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుండగా, తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇస్తోంది. రెండు అగ్రరాజ్యాలు రెండు పక్కలా మద్దతుగా నిలవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు ఇతర దేశాలు కూడ ఈ వ్యవహరంలో తలదూర్చడం కూడ సిరియాలో రావణకాష్టం రగులుతూనే ఉంది.

Why the war in Syria is hotting up

తమ ప్రభుత్వం నుండి తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకొన్న పట్టాణాలను స్వాధీనం చేసుకొనేందుకు అసద్ ప్రభుత్వం తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతోనే అక్కడ ప్రశాంతత కరువైంది.

ఐసిస్ ఆక్రమించిన నగరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పునరావృతం చేయడం పై శ్రద్ధ వహించడం, తిరుగుబాటుదారులతో కాల్పుల విరమణకు సిరియా ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఆ సమయంలో ప్రభుత్వ దళాలు మరోసారి తిరుగుబాటుదారులపై దాడి చేశాయి. జనవరిలో వారు తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ఏకైక ఇడ్లిబ్లోని భాగాలను స్వాధీనం చేసుకొన్నారు. తిరుగుబాటుదారులను పక్కకు తప్పించారు. మరో వైపు ఫిబ్రవరి నెలలో వారు డమాస్కస్ ఉపనగరమైన తూర్పు ఘౌటాలో తిరుగుబాటుదారులను గట్టి దెబ్బతీశారు.

అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న సిరియాకు ఇరాన్‌ కూడ మద్దతు ఇచ్చింది. అయితే ఫిబ్రవరిలో ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ ఇజ్రాయిల్‌ భూభాగంలోకి ప్రవేశించింది. దీంతో ఆ డ్రోన్‌ను ఇజ్రాయిల్ కూల్చివేసింది.

ఫిబ్రవరి 24 న ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. టర్కీ, ఇరాన్ అసద్ పై పోరాటం సాగిస్తామని ప్రకటించారు.సిరియాలో విదేశీ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుండడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం కన్పిస్తోంది. సిరియాలో అంతర్యుధ్దం శాంతికి మరింత అవరోధంగా మారింది.

English summary
FOR a moment it looked as though Syria’s seven-year war, which has killed more than 400,000 people and contributed to the largest refugee crisis in recent history, might be winding down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X