• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టైమ్ దగ్గరపడిందా?: హైడ్రోజన్ బాంబుతో ప్రపంచానికి మూడినట్లే, వినాశనం కోరుతున్న ఉ.కొరియా!

|
  ఉత్తరకొరియా సినిమా రెడీ అయింది : హైడ్రోజన్ బాంబు మూవీ టైటిల్

  వాషింగ్టన్/ప్యోంగ్‌యాంగ్: అగ్రరాజ్యం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా.. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా రోజురోజుకు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. అయితే ఇవి వట్టి వ్యాఖ్యలే అని తేలిగ్గా తీసుకోవడం పొరపాటే అవుతోంది.

  ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

  ముందు నుంచి ఉత్తరకొరియాకు అంత సామర్థ్యం లేదని భావిస్తూ వచ్చిన అమెరికా.. ఇదొక వ్యూహాత్మక తప్పిదమని ఇప్పుడు అంతర్మథనంలో పడింది. ఉత్తరకొరియా నిజంగానే అణు క్షిపణులను తయారుచేస్తోందని తెలిసి.. అమెరికా తీవ్ర ఆందోళనలో పడింది.

  కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

  హైడ్రోజన్ బాంబు:

  హైడ్రోజన్ బాంబు:

  హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఉత్తరకొరియా.. ఈసారి అంతకన్నా శక్తివంతమైన అణుబాంబును తయారుచేసే పనిలో పడింది. ఈ మేరకు కొరియన్ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. దీంతో ప్రపంచ దేశాలన్నింటికి ఉత్తరకొరియా చర్యల పట్ల ఆందోళన మొదలైంది. అటు అమెరికా ఎప్పటికప్పుడు ఉత్తరకొరియా కదలికలపై కన్నేసి ఉంచింది.

  ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

  హైడ్రోజన్ బాంబు తయారీ ఇలా:

  హైడ్రోజన్ బాంబు తయారీ ఇలా:

  అణు బాంబును కేంద్రక విచ్ఛిత్తి పద్ధతిలో తయారు చేస్తారు. యురేనియ, థోరియం, ఫ్లుటోనియం వంటి రేడియో ధార్మిక పదార్థాల భార కేంద్రకాలు తక్కువ శక్తిగల న్యూట్రాన్లను శోషించుకుని విచ్ఛిన్నం చెంది శక్తిని విడుదల చేసే ప్రక్రియనే కేంద్రక విచ్ఛిత్తి అంటారు.ఈ విధానం ద్వారా తయారయ్యే అణుబాంబును పేల్చినప్పుడు కొన్ని కిలో టన్నుల శక్తి విడుదలవుతుంది. దాని ధాటికి లక్షిత ప్రాంతంలో జీవుల మనుగడే లేకుండా పోతుంది.

  హిరోషిమా, నాగసాకిలపై:

  హిరోషిమా, నాగసాకిలపై:

  హిరోషిమాపై వేసిన అణుబాంబు 13 కిలోటన్నుల శక్తిని విడుదల చేసినట్లు చెబుతారు. అలాగే నాగసాకీపై వేసిన బాంబు 21 కిలోటన్నుల శక్తిని విడుదల చేసింది. హైడ్రోజన్‌ బాంబులను కేంద్రక సంలీన విధానంలో ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో బాంబు నుంచి వెలువడే శక్తి అత్యంత ప్రమాదకర రీతిలో ఉంటుంది.

  ఆకాశంలో సూర్యుడు ఇతర నక్షత్రాలు అంత ప్రకాశవంతంగా వెలిగిపోవడానికి కేంద్రక సంలీనమే కారణం . తేలికపాటి మూలకాల కేంద్రకాలను కలిపి భారయుత కేంద్రకాలుగా మార్చడం ద్వారా కేంద్రక సంలీనం ఏర్పడుతుంది. ఈ చర్య వల్ల అత్యధిక శక్తి విడుదలవుతుంది.

  తయారీ:

  తయారీ:

  సూర్యుడిలో సహజంగా జరిగే ఈ ప్రక్రియను కృత్రిమంగా జరిగేలా చేయగలిగితే అదే హైడ్రోజన్‌ బాంబు. హైడ్రోజన్‌ ఐసోటోపులైన డ్యుటీరియం లేదా ట్రీటియంల కేంద్రకాలను సంలీనం చేయడం ద్వారా అత్యధిక శక్తి ఉత్పన్నమవుతుంది.

  కాగా, కేంద్రక సంలీనం జరగడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు కావాలి. ఒక అణుబాంబు పేలినప్పుడు ఎంత వేడి విడుదలవుతుందో అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు కావాలి. ఐదు కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే గానీ హైడ్రోజన్‌ ఐసోటోపులైన డ్యుటీరియంను ట్రీటియంతో సంలీనం చెందించడం సాధ్యపడదు అంటారు. 5కోట్ల ఉష్ణోగ్రత అంటే ఊహకు కూడా అందని పరిణామం. అందుకే వీటిని థర్మోన్యూక్లియర్‌ బాంబులుగా కూడా వ్యవహరిస్తారు.

  హైడ్రోజన్‌ బాంబును ప్రయోగించినప్పుడు.. రెండు దశల్లో దీని పేలుడు జరుగుతుంది. తొలి దశలో

  కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా అందులోని ఆటంబాంబు పేలుతుంది. అప్పుడు పుట్టే వేడి సాయంతో కేంద్రక సంలీన ప్రక్రియ జరిగి హైడ్రోజన్‌ బాంబు పేలుతుంది. ఇది అణుబాంబు కన్నా అత్యంత శక్తిమంతమైనది.

  ట్రంప్ ఆగ్రహం, వాళ్లకు అర్థమయ్యే భాష ఒకటే:

  ట్రంప్ ఆగ్రహం, వాళ్లకు అర్థమయ్యే భాష ఒకటే:

  ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు బెదిరింపులపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఉత్తరకొరియాను ఒక ధూర్త దేశంగా అభివర్ణించారు. ప్రపంచానికి ఆ దేశం ఒక పెనుముప్పుగా తయారైందన్నారు. ఆ దేశాన్ని బుజ్జగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, వారికి అర్థమయ్యే భాష ఒకటేనని పరోక్షంగా యుద్ద వ్యాఖ్యలు చేశారు.

  ఇన్నాళ్లు దక్షిణ కొరియా వెలిబుచ్చిన ఆందోళన నిజమేనని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకొరియాపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన కొత్త ముసాయిదాను రూపొందిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. ముసాయిదా ప్రకారం ప్రకారం ఉత్తరకొరియాతో వ్యాపారం జరిపే ఏ దేశమైనా తమతో వ్యాపారం జరపడానికి కుదరదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు.

  ప్రపంచ దేశాల ఆందోళన, తీవ్ర పర్యవసానాలు;

  ప్రపంచ దేశాల ఆందోళన, తీవ్ర పర్యవసానాలు;

  దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జె-ఇన్‌ నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రత మండలి ఉత్తరకొరియా దుందుడుకు వైఖరిపై చర్చించింది. హైడ్రోజన్ బాంబును అర్థరహితమైన వ్యూహంగా పేర్కొంది. అటు జపాన్‌ ప్రధాని షింజో అబె కూడా దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు.

  ఉత్తర కొరియా అణుపరీక్షలు జపాన్‌కు పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాతో పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో ట్రంప్‌, అబె టెలిఫోన్‌ చర్చలు జరిపారు. సామరస్యపూర్వక ప్రయత్నాలతో ఉత్తరకొరియా మాట వినేలా లేదన్న నిర్ణయానికి వచ్చారు.

  ఉత్తరకొరియాకు మిత్రదేశంగా ఉన్న చైనాపై ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరకొరియాను చైనా నియంత్రించకపోవడంపై ప్రపంచ దేశాలన్ని ఒకే గళం వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐరాస ఆంక్షలతో ఒకింత ఒత్తిడి తెచ్చినా.. ఉ.కొరియాతో స్నేహం విషయంలో చైనా మొండి వైఖరి కొంత ఆందోళన కలిగిస్తోంది.

  ఉత్తరకొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవని రష్యా హెచ్చరించింది. ఉత్తరకొరియాపై యూరోపియన్‌ యూనియన్‌ కఠిన ఆంక్షలు విధించాలని, అంతర్జాతీయ సమాజం దీనిపై బలంగా వాణి వినిపించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అన్నారు.

  ఏదేమైనా ఇన్నాళ్లు కేవలం హెచ్చరికలకే పరిమితమైన ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తామంటూ బెదిరించడం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతోంది. దీనిపై త్వరితగతిన ప్రపంచ దేశాలన్ని ఒక్కటి కాకపోతే ఉత్తరకొరియాతో ప్రపంచానికి మూడినట్లే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

  English summary
  While the world agonized over the huge nuclear test in North Korea this weekend, President Trump aimed his most pointed rhetorical fire not at the renegade regime in Pyongyang, but at America’s closest partner in confronting the crisis: South Korea.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more