• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా ఎన్నికలు భారత్‌కు ఎందుకు కీలకం - కారణాలివే అంటున్న విశ్లేషకులు

|

అమెరికా ఎన్నికలకు వారం రోజుల సమయమే మిగిలుంది. గతంతో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి అమరికా ఎన్నికల్లో భారతీయుల పాత్ర ఎలా ఉండబోతోందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. భారత్‌ను, భారతీయులను బుజ్జగించే పనిలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇరు పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు భారత్‌ కోణంలో చూసినా ప్రత్యేకంగా మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం చైనాతో నెలకొన్న ఘర్షణలే. సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన, పలు అంశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చైనాను అడ్డుకోవాలంటే ఇప్పుడు అధ్యక్ష అభ్యర్ధులతో సంబంధం లేకుండా భారత్‌ క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది.

9 రోజుల ముందు అనూహ్య మార్పులు: 2016 కంటే పెరిగిన అమెరికా అధ్యక్ష ఎర్లీ ఓటింగ్

 అమెరికా ఎన్నికల్లో భారతీయం...

అమెరికా ఎన్నికల్లో భారతీయం...

వచ్చే నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పోటీలో నిలిచిన ఇద్దరు అభ్యర్ధులు డొనాల్డ్‌ ట్రంప్‌‌, జో బిడెన్‌ భారత్‌ జపం చేస్తున్నారు. రిపబ్లికన్లతో పోలిస్తే డెమోక్రాట్లకు భారత్‌ మద్దతు ఉంటుందనేది నిర్వివాదాంశం. అయితే అధ్యక్ష బరిలో ఉన్న వారితో సంబంధం లేకుండా ఈసారి ఇద్దరిలో ఎవరు గెలిచినా భారత్‌ ప్రయోజనాలకు పనిచేస్తే చాలనే వాదన మన వారిలో పెరుగుతోంది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఈసారి స్పష్టమైన చీలిక కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ మద్దతు కోసం ట్రంప్‌ గతంలో హౌడీ-మోడీ కార్యక్రమం నిర్వహించగా.. భారత్‌ కూడా నమస్తే ట్రంప్‌ నిర్వహించింది. ఈ రెండు కార్యక్రమాల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. డెమోక్రాట్‌ అభ్యర్ధులు మాత్రం సంప్రదాయ భారతీయుల ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు.

 భారత్‌కు కీలకం ఎందుకంటే ?

భారత్‌కు కీలకం ఎందుకంటే ?

గతంతో అమెరికాతో ఆర్ధిక, సామాజిక, వ్యూహాత్మక అవసరాల కోసం సంబంధాలు నెరిపిన భారత్‌.. ఈసారి మాత్రం ఆగ్రరాజ్యం తమకు తప్పనిసరి మిత్రుడిగా ఉండాలని కోరుకుంటోంది. గతంలో భారత్‌తో ఉన్న అవసరాల కొద్దీ అమెరికా ప్రభుత్వాలు, అధ్యక్షులు తమ వీసా, వ్యాపార, ఇతర విధానాలు రూపొందించేవి. ఇప్పుడు వాటితో సంబంధం లేకపోయినా భారత్ అమెరికాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో పెరిగిన ముప్పే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 1971లో సోవియట్‌ యూనియన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌వైపు మొగ్గిన అమెరికా.. మారిన పరిస్ధితుల్లో చైనాను వ్యతిరేకిస్తున్న భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటోంది. ఇది భారత్‌కు కూడా మేలు చేసే పరిస్ధితి ఉండటంతో భారతీయులు ఇప్పుడు అమెరికాను తమ ప్రధాన శత్రువుగా చూడటం మానేశారు.

  US election 2020 : Donald Trump's Filthy India Remark ఇండియా మురికి దేశమంటూ ట్రంప్...! || Oneindia
   చైనాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, బిడెన్‌...

  చైనాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, బిడెన్‌...

  అమెరికాకు భారత్‌ దగ్గరవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు, ఎన్నికల్లో భారత్‌ మద్దతు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల వెనుక ఓ ప్రధాన కారణం చైనాయే. ఎందుకంటే భారత్‌ తమకు ప్రధాన శత్రువుగా ఉన్న చైనాను వ్యతిరేకిస్తున్న ఇద్దరు అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధులు ట్రంప్‌, బిడెన్ విషయంలో స్పష్టమైన వ్యతిరేకత చూపేందుకు సిద్ధంగా లేదు. రేపు వీరిద్దరిలో ఎవరు గెలిచినా చైనా విషయంలో కాస్త అటు ఇటుగా కరకు వైఖరే అవలంబించే అవకాశముందని భారత్‌ అంచనా వేస్తోంది. ఈ భయం చైనాపై కచ్చితంగా పనిచేస్తుందని భారత్‌ అభిప్రాయపడుతోంది. అందుకే గుడ్డి వ్యతిరేకతతో వీరిలో ఏ ఒక్కరినో స్పష్టంగా వ్యతిరేకించేందుకు సిద్ధంగా లేదు. దీంతో అమెరికా ఎన్నికల్లోనూ భారతీయుల్లో చీలిక కనిపిస్తోంది.

  English summary
  The US relationship is the most important of India’s bilateral ties, having grown in recent years on account of China’s belligerence. In the concluding part of a series on the US Presidential election, a look at how this relationship has evolved, and its highs and lows irrespective of whether the President has been a Democrat or a Republican.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X