వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌కు అరుదైన గౌరవం

By Narsimha
|
Google Oneindia TeluguNews

ధావోస్: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. థావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత సినీ నటుడు షారూఖ్‌ ఖాన్‌ క్రిస్టల్ పురస్కారాన్ని అందుకొన్నాడు. ఈ సందర్భంగా షారూఖ్ చేసిన ప్రసంగం పలువురి ప్రశంసలు పొందింది.

Recommended Video

షారుక్‌ ప్రసంగం : చంద్రబాబు ప్రశంసలు (వీడియో)

మహిళలు, చిన్నారుల హక్కుల కోసం గణనీయమైన కృషి చేసే వ్యక్తులకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఈ అవార్డును ఏటా అందజేస్తోంది. మీర్‌ ఫౌండేషన్‌ ద్వారా షారూఖ్‌ తన సేవలను అందిస్తున్నారు. యాసిడ్ దాడులకు గురైన మహిళలకు, అగ్ని ప్రమాదాల్లో గాయపడిన వారికి మెడికల్ ట్రీట్ మెంట్ అందించడం, న్యాయ సహయం అందిస్తున్నారు.వోకేషనల్ ట్రైనింగ్, పునరావాసంతో పాటు జీవనం కోసం కూడ షారూఖ్‌ ఖాన్ ఈ పౌండేషన్ ద్వారా సేవలను అందిస్తున్నారు.

Why was Shah Rukh Khan awarded at Davos?

హాలీవుడ్‌ తారలు కేట్‌ బ్లాంచెట్‌, లెజెండరీ సంగీత దర్శకుడు ఎల్టోన్‌ జాన్‌లతోపాటు షారూఖ్‌కి 24వ క్రిస్టల్‌ అవార్డును అందుకున్నాడు. ఇక అవార్డు పట్ల డబ్ల్యూఈఎఫ్‌కు షారూఖ్‌‌ఖాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌ తరపున ఈ అంశంపై మరింతగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించాడు. అనంతరం బ్లాంచెట్‌తో స్టేజీపై సెల్ఫీ దిగేందుకు యత్నించి సదస్సులో నవ్వులు పూయించాడు.

షారూఖ్‌ ఖాన్ నిర్వహిస్తున్న మీర్ పౌండేషన్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నాలెడ్జీ షేరింగ్ కార్యక్రమాలను, ప్రజల్లో పలు విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన చిన్నారులకు ఉచితంగా ఈ పౌండేషన్ ద్వారా షారూఖ్ ఖాన్ చికిత్స అందిస్తున్నారు

English summary
Shah Rukh Khan, who was honoured with the Crystal Award organised by the World Economic Forum (WEF) in Davos on Monday evening, made a touching speech at the event. The Bollywood superstar was honoured for his 'leadership in championing children's and women's rights in India'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X