• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా : రియల్ హీరో ఫైనల్ గిఫ్ట్... స్వర్గం నుంచి చూడగలవా అంటూ భార్య భావోద్వేగం...

|

ప్రపంచానికి ఊపిరి సలపకుండా చేస్తోన్న కరోనా వైరస్‌ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసిన ఆప్తమాలజిస్ట్ వైద్యుడు లీ వెన్లియాంగ్(34).. ఆ తర్వాత అదే కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. లీ కరోనా గురించి మొదట్లో హెచ్చరించినప్పుడు.. అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. కానీ ఆ తర్వాత లీ చెప్పిన మాటలే నిజమవడంతో.. చైనీయులు ఆయన్ను హీరో అంటూ కొనియాడారు. లీ హెచ్చరికలను పట్టించుకోని చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లీ చనిపోయే నాటికి గర్భంతో ఉన్న ఆయన భార్య.. తాజాగా ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.

లీ ఇచ్చిన ఫైనల్ గిఫ్ట్..

లీ ఇచ్చిన ఫైనల్ గిఫ్ట్..

లీ భార్య ఫు జుజీ శుక్రవారం(జూన్ 13) వుహాన్‌లోని ఓ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె 'ఫైనల్ గిఫ్ట్' పేరుతో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ విచాట్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. 'నువ్వు స్వర్గం నుంచి చూడగలవా.. నాకు నువ్విచ్చిన చివరి బహుమతి ఈరోజు ఈ లోకంలోకి వచ్చింది. నేను మన బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.' అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ వార్త చెప్పడమే ఆలస్యం చైనీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. లీ వెన్లియాంగ్-ఫు జుజీకి కలిగిన రెండో సంతానంపై చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి ఎప్పుడూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

సంబరపడుతున్న నెటిజన్స్..

సంబరపడుతున్న నెటిజన్స్..

చైనీస్ మీడియా కథనం ప్రకారం... ఆ శిశువు 3.45కి.గ్రా బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు. వెన్లియాంగ్‌కి కొడుకుకి పుట్టిన విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ సంబరపడిపోతున్నారు. 'ఈరోజుకి నాకు అన్నింటికంటే ఇదే బెస్ట్ న్యూస్... ప్రజలు ఇంకా లీ వెన్లియాంగ్‌ని మర్చిపోలేదు... తలుచుకుంటేనే దు:ఖం తన్నుకొచ్చినట్టు అనిపిస్తోంది.' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్.. 'లీ వెన్లియాంగ్ స్ఫూర్తిని ఆయన కొడుకు కూడా కొనసాగిస్తాడని ఆశిద్దాం.' అంటూ కామెంట్ చేశారు. గత ఫిబ్రవరిలో కరోనా కారణంగా మృత్యువాతపడ్డ లీ వెన్లియాంగ్‌ను.. చైనీస్ ప్రభుత్వం కరోనాపై పోరులో ప్రాణ త్యాగం చేసిన వైద్యుడిగా గుర్తించి ఆయన కుటుంబానికి మెడల్ అందజేసింది.

చైనాను మొదట్లోనే హెచ్చరించిన లీ..

చైనాను మొదట్లోనే హెచ్చరించిన లీ..

చైనాలో ఆస్పత్రులకు క్యూ కడుతున్న ప్రజలను చూసి.. దేశంలో అంతుచిక్కని అసాధారణ పరిస్థితులేవో నెలకొన్నాయని లీ వెన్లియాంగ్ భావించాడు. తన ఆస్పత్రిలో చేరిన ఏడుగురు పేషెంట్లలో 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ లక్షణాలను గుర్తించాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తన మిత్రులతో పంచుకుని వారిని అప్రమత్తం చేశాడు. ఆ మెసేజ్‌లు బయటకు లీకై వైరల్‌గా మారడంతో.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత రెండు వారాలకు ఆయన్ను విడుదల చేశారు.

  Coronavirus : ప్రపంచంలోనే నాలుగో స్థానానికి India రికార్డ్ బ్రేక్ ...!!
  ఫిబ్రవరిలో కరోనాతో లీ మృతి..

  ఫిబ్రవరిలో కరోనాతో లీ మృతి..

  తిరిగి వైద్యుడిగా తన విధుల్లో చేరిన లీ వెన్లియాంగ్.. జనవరి రెండో వారంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను ఐసోలేషన్‌కి తరలించారు. తాను కోలుకుంటానని,తిరిగి తన ఆస్పత్రికి వెళ్లి పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తానని ఆశించాడు. నిజానికి ఇది కూడా సార్స్ తరహా వైరసే అని లీ భావించాడు. కానీ ఈ వైరస్ అంతకంటే ప్రాణాంతకమైనదని.. దీని జన్యు క్రమం దానికంటే భిన్నమైనదని అప్పటికీ వెన్లియాంగ్‌కి తెలియదు. కొద్దిరోజులకు లీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 1న ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లీ అరెస్టును సుప్రీం పీపుల్స్ కోర్టు సైతం తప్పు పట్టింది. లీ హెచ్చరికను మొదట్లోనే సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇంత డ్యామేజ్ జరగకపోయేదని అభిప్రాయపడింది. ఆ తర్వాత పోలీసులు కూడా లీ వెన్లియాంగ్‌ అరెస్టుకు చింతిస్తూ క్షమాపణలు చెప్పారు.

  English summary
  Are you seeing this in heaven? The last gift you gave me was born today. I will love and take care of him," Li Wenliang's wife wrote on her WeChat moments after giving birth to their second child, a boy, on Friday, media reported.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X