• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీ కేర్ ఫుల్! సీఐఏ.. దేనినైనా హ్యాక్ చేస్తుంది.. రహస్యాలూ వింటుంది

By Ramesh Babu
|

న్యూయార్క్: ఆపిల్ ఐఫోన్.. ఆండ్రాయిడ్ డివైజ్.. స్మార్ట్ టీవీ.. ఏదైనా సరే.. ఎంతటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువైనా సరే.. సీఐఏ ముందు బలాదూరే. హైటెక్ ఫోన్లు, టీవీల ద్వారా మీ కదలికలపై అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచుతుందట.

ఇలాంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల ఆధారంగా మీ రహస్యాలన్నీ సీఐఏ లాగివేసే ప్రమాదం ఉందట. అగ్రరాజ్యానికి చెందిన సీక్రెట్ సర్వీస్ - సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కదలికలను స్కాన్ చేస్తోంది.

ప్రతి ఒక్కరి ఫోన్, టీవీలను హ్యాక్ చేసే టెక్నాలజీ సీఐఏ దగ్గర ఉంది. ఈ విషయానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా వికీలీక్స్ సంస్థ వెల్లడించింది. అమెరికా ఆర్మీ చేస్తున్న అకృత్యాలకు చెందిన రహస్యాలను గతంలో బయటపెట్టిన వికీలీక్స్ సంస్థ ఈ సారి ఏకంగా ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసింది.

WikiLeaks Says CIA Can Hack Into Apple, Android Devices and Smart TVs

తమ దగ్గర ఉన్న హ్యాకింగ్ టెక్నాలజీని దాచిపెట్టేందుకు సీఐఏ ఆ ఆరోపణలను రష్యాపైకి తోసివేసిందని, సీఐఏ దగ్గర ఉన్న హ్యాకింగ్ టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు దొంగిలించారని కూడా వికీలీక్స్ మరో విభ్రాంతికర ప్రకటన కూడా చేసింది. నేరస్తులు, విదేశీ గూఢచారుల వద్ద ఆ హ్యాకింగ్ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ ఉన్నట్లు కూడా పేర్కొంది.

ఈ హ్యాకింగ్ టూల్స్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లడంపై అమెరికాలో కొంతమంది రాజకీయ నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. హ్యాకింగ్ టూల్స్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల సైబర్ ఆయుధాలు తయారు చేయడం అమెరికాకు కష్టమవుతుందని కూడా వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తెలిపారు. సీఐఏ అంటే.. శక్తివంతమైన హ్యాకింగ్ సంస్థ అంటూ ఘాటైన ఆరోపణలు కూడా చేశారు.

సీఐఏ అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ శాంసంగ్ స్మార్ట్ టీవీలను కూడా హ్యాక్ చేయగలదట. టీవీని ఫేక్-ఆఫ్ మోడ్ లో ఉంచి, దానికి సమీపంలో ఉండే వ్యక్తుల సంభాషణలు నేరుగా అమెరికా గూఢచారులకు వెళ్తాయట.

ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ డివైజ్ల నుంచి రహస్యంగా సమాచారాన్ని సేకరించే హ్యాకింగ్ టూల్స్ సీఐఏ దగ్గర ఉన్నట్లు వికీలీక్స్ ఆరోపించింది. మరోవైపు ఆపిల్ సంస్థ మాత్రం తమ ఫోన్లను హ్యాక్ చేసే టెక్నాలజీ ఏదీ లేదని వాదిస్తోంది. అయితే సీఐఏ హ్యాకింగ్ అంశంపై వికీలీక్స్ కు సమాచారం ఎక్కడి నుంచి అందిందనే విషయాన్ని మాత్రం అమెరికా అధికారులు ధ్రువీకరించలేకపోతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anti-secrecy group WikiLeaks published what it said were thousands of pages of internal CIA discussions about hacking techniques used over several years, renewing concerns about the security of consumer electronics and embarrassing yet another U.S. intelligence agency.The discussion transcripts showed that CIA hackers could get into Apple Inc iPhones, Google Inc Android devices and other gadgets in order to capture text and voice messages before they were encrypted with sophisticated software.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more