వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యా

|
Google Oneindia TeluguNews

లండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్‌మాల్యాను భారత్‌కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. భారత్‌లోని కోర్టులకు విజయ్ మాల్యా సమాధానం చెప్పాల్సి ఉందని భావించింది లండన్‌లోని వెస్ట్‌మిన్స్‌టర్ మెజిస్ట్రేట్ కోర్టు. డిసెంబర్ 10 వతేదీన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Will appeal against extradition order, says Vijay Mallya

ఇరుదేశాల నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్న నేపథ్యంలో వెస్ట్‌మిన్స్‌టర్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీని హోమ్‌సెక్రటరీ సాజిద్ జావిద్‌కు పంపడం జరిగింది. అయితే నేరస్తుడిగా పరిగణించబడుతున్న ఓ వ్యక్తిని మరో దేశానికి పంపగలిగే అధికారం ఒక్క హోమ్ సెక్రటరీకే ఉన్న నేపథ్యంలో జడ్జి తీర్పు కాపీ సాజిద్ జావిద్‌కు పంపడం నిర్ణయం తనకే వదిలేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆర్డర్ కాపీలపై జావిద్ సంతకం పెట్టేందుకు రెండు నెలల గడువు ఉంటుంది. అయితే అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న జావిద్ ఆర్డర్ కాపీపై సంతకం చేశారని యూకే హోమ్‌శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 3న అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన మీదట హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ ఆర్డర్ కాపీలపై సంతకం చేశారని తెలిపిన హోం కార్యాలయం విజయ్ మాల్యా భారత్‌లోని పలు బ్యాంకులకు తీసుకున్న రుణాలు ఎగవేశారని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో ఆయన్ను భారత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 4 నుంచి మాల్యా కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 14 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే డిసెంబర్ 10న వెస్ట్‌మిన్స్‌టర్ కోర్టు హోంశాఖకు ఆర్డర్ కాపీ పంపగానే తాను కోర్టును ఆశ్రయించేవాడినని అయితే హోమ్ శాఖ నిర్ణయం ఎలా ఉంటుందో అప్పటికి బయటకు రాకపోవడంతో తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాల్యా ట్వీట్ చేశారు. ఇప్పుడు హోంశాఖ తన నిర్ణయం వెల్లడించిన నేపథ్యంలో తను కోర్టును ఆశ్రయిస్తానని ట్వీట్‌లో స్పష్టం చేశాడు మాల్యా. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నారు.

English summary
Hours after his extradition to India was approved by the UK government, fugitive business tycoon Vijay Mallya on Monday said he will initiate the appeal process.The 63-year-old business tycoon had been found to have a case to answer before the Indian courts by Westminster Magistrates' Court in London on December 10, 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X