వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్‌ వన్‌ టైమ్‌ ప్రెసిడెంటేనా ? రేపటితో 78 ఏళ్లు పూర్తి- మరోసారి ఎన్నికపై ఊహాగానాలు...

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితాలు ప్రకటించకపోయినా విజేత ఎవరో దాదాపు స్పష్టమైపోయింది. డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ కాబోయే అధ్యక్షుడిగా నిర్ధారణ అయిపోయింది. దీంతో ఆయన త్వరలో వైట్‌హౌస్‌లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 6 తర్వాత వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్న బైడెన్‌ నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. అయితే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కూడా ఇప్పుడే మొదలైంది. దీనికి పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.

 అమెరికా అధ్యక్షుడిగా బైడెన్...

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన డెమోక్రాట్‌ అభ్యర్ధి జో బైడెన్‌ త్వరలో పగ్గాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల అక్రమాలు ఆరోపణలు చేస్తున్నా అంతిమంగా బైడెన్‌దే గెలుపుని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించే పరిస్ధితి. అమెరికా చరిత్రలోనే అత్యధిక మెజారితో గెలుపొందిన బైడెన్‌పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే భారత ప్రధాని మోడీ సహా పలు దేశాధినేతలు బైడెన్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలుపుతున్నారు. త్వరలోనే ఆయన వైట్‌హౌస్‌లోకి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనవరి 6 తర్వాత ఏ క్షణాన్నైనా ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెడతారు.

బైడెన్‌ అధ్యక్ష పదవీకాలం...

బైడెన్‌ అధ్యక్ష పదవీకాలం...

అమెరికా అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్‌ నాలుగేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. వైట్‌హౌస్‌ నుంచే పాలన సాగిస్తారుయ ఆయనకు డిప్యూటీగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ వ్యవహరించబోతున్నారు. ఆమె కూడా బైడెన్‌తో పాటు నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న బైడెన్‌కు రేపటితో 78 ఏళ్లు నిండుతాయి. ఆయన పదవీకాలం పూర్తి చేసుకునే 2024 నాటికి ఆయనకు 82 ఏళ్లు వస్తాయి. ఇప్పటికే వయోభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బైడెన్‌ మరోసారి ఎన్నికవుతారా లేదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమే అయినా ఈ అంశంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.

Recommended Video

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన Pfizer.. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు ఇలా!
 బైడెన్‌కు అధ్యక్ష పదవి ఒక్కసారేనా...?

బైడెన్‌కు అధ్యక్ష పదవి ఒక్కసారేనా...?

జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గతంలో ఆయన బరాక్‌ ఒబామాకు డిప్యూటీగా రెండుసార్లు వ్యవహరించారు. ఎనిమిదేళ్లపాటు అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది. అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపడుతున్న బైడెన్‌కు ఈ బాధ్యతలు తొలిసారితో పాటు చివరి సారి కూడా కానున్నాయా అంటే మెజారిటీ విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు.

దీనికి కారణం ఆయన వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడే నాటికి బైడెన్‌కు 82 ఏళ్లు వస్తాయి. రెండోసారి అధికారం పూర్తి చేసుకునే నాటికి 86 ఏళ్లు నిండుతాయి. ప్రస్తుతం బైడెన్‌ పరిస్ధితి చూస్తుంటే ఇది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాత్రం రెండుసార్లు అధికారం చేపట్టాలనే కోరిక మీ మనసులో ఉందా అంటే అవుననే బైడెన్‌ సమాధానమిచ్చారు. బైడెన్‌తో పాటు ఆయన పార్టీ సభ్యులు, కుటుంబం ఇలా ప్రతీ ఒక్కరూ ఆయన రెండోసారి ఎన్నిక కావడం ఖాయమనే అంచనాలోనే కనిపిస్తున్నారు.

English summary
Joe Biden, the oldest person ever to win the US presidency, will celebrate his 78th birthday on Friday. If he were to run and be reelected in 2024, he would be 86 at the end of a second term in 2029.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X