• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లండన్ వెళ్లి నాబిడ్డతో ఉండాలనుంది: సిరియాలోని మహిళా ఉగ్రవాది

|

2015లో లండన్‌ నుంచి పారిపోయి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరిన బంగ్లాదేశీ యువతి తిరిగి బ్రిటన్‌కు చేరుకోవాలని భావిస్తోంది. ఐసిస్‌లో ఉండగా అక్కడి ఉగ్రవాదులను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. తన కడుపులో బిడ్డ కంటే తనకేది ముఖ్యం కాదని చెబుతూ వెంటనే తిరిగి లండన్‌కు వెళ్లాలని భావిస్తోంది.

షమీమా బేగం అనే యువతి 2015లో బ్రిటన్‌లోని ఓ స్కూలు నుంచి పారిపోయి వచ్చింది. ఈమెతో పాటు మరో ముగ్గురు కూడా పారిపోయి వచ్చారు. ఆ సమయంలో వారు ఐసిస్ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్నారు. సిరియాలోని ఓ చోటు నుంచి మాట్లాడిన బేగం తను ఇంతకుముందు ఇద్దరి పిల్లలను పోగొట్టుకున్నట్లు వెల్లడించింది.ఇప్పుడు తాను 9నెలల నిండు గర్భిణిని అని చెబుతూ వెంటనే లండన్‌కు తిరిగి వచ్చేయాలని ఉందని వెల్లడించింది.

‘Will do anything to come back’: Pregnant UK schoolgirl who joined ISIS in Syria

ప్రస్తుతం తాను జీహాదీల నుంచి తప్పించుకు వచ్చినట్లు చెప్పిన బేగం... సిరియాలోని పునరావాస కేంద్రంలో ఉన్నట్లు చెప్పింది. తన కడుపులోని బిడ్డ ఆరోగ్యం దెబ్బతినకముందే తను లండన్ చేరుకునేలా సహాయం చేయండంటూ ఆమె అర్థిస్తోంది. ఇక ఇప్పటి నుంచి ఏ క్షణమైనా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని ఆమె వెల్లడించింది.ఒకవేళ ఇంటికి చేరుకోగలిగితే తాను తన బిడ్డతో సంతోషంగా గడుపుతానని పేర్కొంది.

2015 ఫిబ్రవరిలో షమీమా బేగంతో పాటు బెతనల్ గ్రీన్ అకాడెమీ స్కూలు నుంచి మరో ఇద్దరు విద్యార్థులు కటిజా సుల్తానా, అమిరా అబేస్లు గట్విక్ నుంచి టర్కీకి పారిపోయారు. అక్కడి నుంచి సిరియాకు పారిపోయారు.ఇక ఓ దాడిలో సుల్తానా మృతి చెందినట్లు ఆమె తెలిపింది. తొలుత తను ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించింది కాని...27 ఏళ్ల డచ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇతను కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు వెల్లడించింది షమీమా.

ఇక అప్పటి నుంచి ఇద్దరూ కలిసే ఉన్నారు. గతవారమే బాగుజ్ నుంచి ఇద్దరు తప్పించుకున్నారు.ఐసిస్‌లో ఫైటర్‌గా ఉన్న తన భర్త అమెరికా మద్దతు ఇస్తున్న సిరియన్ డెమొక్రటిక్ బలగాలకు లొంగిపోయాడని...ఇక అప్పటి నుంచి తన భర్తను చూడలేదని పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులు ఆగడాలు మితిమీరిపోయాయని మానవత్వం అనేది లేకుండా పోయిందని చెప్పిన షమీమా వారు భూమిపై ఉండేందుకు అర్హులు కారని చెప్పింది.

ముందుగా బ్రిటీషు ప్రభుత్వం తిరిగి తమ దేశానికి రావొద్దని చెప్పింది. తర్వాత ఒక్క అవకాశం ఇస్తే అన్నీ మానేసి తన బిడ్డతో కలిసి బతుకుతానని చెప్పింది షమీమా. దీంతో ఆలోచిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

English summary
Shamima Begum, 15, was one of three British schoolgirls who ran away from their homes in the UK in 2015 to be jihadi brides, causing much concern in the country on the impact of online radicalisation, especially among the youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X