వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్ ప్రైజ్ ఇస్తానంటే వద్దన్నా, మలాలాకు ఇవ్వడంలో రాజకీయం: శ్రీశ్రీ రవిశంకర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ నోబెల్ బహుమతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్‌కు నోబెల్ బహుమతి రావడం వెనుక రాజకీయం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తనకు పని చేయడం పైనే దృష్టి ఉంటుందని, చేసిన పనికి గౌరవం పొందడం గురించి ఎన్నడూ ఆలోచించనని చెప్పారు. నోబెల్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజకీయాల ఆధారంగా పురస్కారాలకు ఎంపికలు చేస్తున్నారని మండిపడ్డారు.

Sri Sri Ravi Shankar

పాకిస్తాన్ ఉద్యమకారిణి మలాలాకు నోబెల్ పురస్కారం ఇవ్వడంలో రాజకీయాల పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో తనకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇస్తామని చెప్పారని, దానిని తాను తిరస్కరించానని చెప్పారు. తనకు ఇస్తే తీసుకోనని చెప్పారు.

మలాలాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఆమెకు ఆ పురస్కారం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఆయన శనివారం నాడు లూతూర్ ప్రాంతంలో పర్యటించారు.

English summary
Terming the decision to award the Nobel Peace Prize to Pakistani activist Malala Yousafzai ‘political’, spiritual leader Sri Sri Ravi Shankar on Saturday said that he would never accept the award. He was in Latur on Saturday to review the drought situation in Marathwada when he made the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X