వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:వేసవికాలంలో కరోనావైరస్ అంతమవుతుందా..? పరిశోధకులు ఏం తేల్చారు..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ పై ఎన్నో వదంతులు వస్తున్నాయి. కొన్ని నమ్మేలా ఉన్నా వాటిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఏది నిజమో ఏది అబద్దమో తెలియక కొందరు సోషల్ మీడియాపై వదంతులను అదేపనిగా పోస్టు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలు వదంతులు ఫేక్ అని చెబుతూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రపంచఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కరోనావైరస్ మహమ్మారిపై ఎలాంటి అనుమానాలున్నా ప్రపంచ ఆరోగ్యసంస్థ నివృత్తి చేస్తోంది. తాజాగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న అధిక ఉష్ణోగ్రతల మధ్య కరోనావైరస్ బతుకుతుందా..? ఈ వేసవి కాలంలో కోవిడ్-19 అంతమవుతుందా అనే చర్చ జరుగుతోంది.

 అధిక ఉష్ణోగ్రతలు వైరస్‌ను చంపేస్తాయా..?

అధిక ఉష్ణోగ్రతలు వైరస్‌ను చంపేస్తాయా..?

ఇక సాధారణంగా జలుబు లాంటి వైరస్‌లు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయాల్లో మరొకరికి సంక్రమించవు. కానీ కరోనావైరస్ అధిక ఉష్ణోగ్రత సమయాల్లో సంక్రమిస్తుందా అని చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ స్టడీ ఈ విషయంపై పరిశోధనలు చేసింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లేదా తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించలేదనే విషయం వెల్లడైనట్లు పరిశోధకులు చెప్పారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో మాత్రం అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని వారు తేల్చారు. ఇది ఇంకా విశ్లేషణ స్థాయిలోనే ఉన్నందున ఒక చిన్న హింట్ భారీ ఊరటను ఇస్తోంది.

 ఎంత రేంజ్ ఉష్ణోగ్రతల మధ్య వైరస్ బతికే ఉంటుంది..?

ఎంత రేంజ్ ఉష్ణోగ్రతల మధ్య వైరస్ బతికే ఉంటుంది..?

అమెరికాలోని మశాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖాసి బుఖారీ, యూసఫ్ జమీల్‌లు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులను స్టడీ చేశారు. 3 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని ఈ ప్రాంతాల నుంచే 90శాతం కేసులు నమోదైనట్లు వారు గుర్తించారు. అంతేకాదు గాల్లో తేమశాతం క్యూబిక్ మీటర్‌కు 4 నుంచి 9 శాతం ఉన్నప్రాంతాల్లో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. 18 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు, క్యూబిక్ మీటర్‌కు 9 గ్రాముల కంటే అధికంగా గాల్లో తేమ ఉన్న దేశాల్లో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కరోనావైరస్ తక్కువగా సంక్రమిస్తోందనేది అర్థమవుతోందని జమీల్ మరియు బుఖారీలు చెప్పారు. ఇక కరోనావైరస్ వ్యాప్తి చెందడంలో గాలిలోని తేమ కీలక పాత్ర పోషిస్తుందని వారు కంక్లూడ్ చేశారు.

 గాల్లో తేమ వైరస్‌ను అంతమొందించడంలో కీలక పాత్ర

గాల్లో తేమ వైరస్‌ను అంతమొందించడంలో కీలక పాత్ర

ఇదిలా ఉంటే వేసవి కాలంలో వైరస్ చచ్చిపోతుంది అనుకుంటే భ్రమే అవుతుందని మరో బాంబు పేల్చారు. ప్రజలు కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయిన్‌టెయిన్ చేయాల్సిందేనని వారు వెల్లడించారు. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో జూన్ నెల వరకు గాలిలోని తేమ శాతం తక్కువగానే ఉంటుందని దీంతో కరోనావైరస్ వ్యాప్తి నిలువరించడం కష్టం అని చెప్పారు. ఆ తర్వాత క్యూబిక్ మీటర్‌కు 9గ్రాములు ఉంటుంది కాబట్టి కాస్త తగ్గే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ మహమ్మారి వ్యాప్తి చెందడం తగ్గుతుందని వెల్లడించారు. ఇక అప్పటి వరకు నార్త్ అమెరికా ఉత్తర ఐరోపా దేశాల్లో ఈ మహమ్మారి దాడ తప్పదని వెల్లడించారు.

 డ్రాప్‌లెట్‌గా వైరస్

డ్రాప్‌లెట్‌గా వైరస్

వేసవికాలంలో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని మరో ఇన్‌ఫెక్షియస్ డిజీస్ స్పెషలిస్టు డాక్టర్ విలియం స్కాఫ‌నర్ చెప్పారు. కొన్ని శ్వాససంబంధిత వైరస్‌లు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో జీవించి ఉండటం చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ స్కాఫనర్ చెప్పారు. అంతేకాదు ఏదైనా వైరస్‌ గొంతులోకి పోయిందంటే అది గొంతులో చిక్కుకుని తిరిగి గాల్లోకి విడుదల అవుతుందన్నారు. దాన్ని మైక్రోస్కోప్‌ ద్వారా చూస్తే అది తేమతో కూడిన డ్రాప్‌లెట్ అయి ఉంటుందని వెల్లడించారు. గాల్లో తేమ లేని సమయంలో ఉదాహరణకు శీతాకాలంలో తేమ ఆవిరైపోతుంది. అంటే గాల్లో వైరస్ ఎక్కువ సమయం జీవించే ఉంటుంది. అంతేకాదు ఈ వైరస్‌పై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కూడా ఉండదని వారు చెప్పారు.

 వేసవికాలంలో వైరస్‌ చనిపోయే అవకాశం..?

వేసవికాలంలో వైరస్‌ చనిపోయే అవకాశం..?

వేసవి కాలంలో శ్వాస తీసుకునే సమయంలో వైరస్‌ డ్రాప్‌ పొరపాటున లోపలికి వెళ్లిందంటే.. అది ఆవిరైపోదు. అంటే ఇది అధిక బరువు కలిగి ఉండటం వల్ల వెంటనే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం దీనిపై పడి మట్టుబెడుతుంది. శీతాకాల సమయంలో గాల్లో ఎక్కువ సేపు ఉన్నంత సమయం వేసవికాలంలో ఉండదని స్కాఫనర్ చెబుతున్నారు. దీంతో వ్యక్తికి వైరస్ సోకే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు వేసవికాలంలో వైరస్ సంక్రమించే అవకాశాల స్థాయి చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి వేసవి కాలంలో అంతగా భయపడాల్సిన పనిలేదని వివరించారు. అదే సమయంలో బయట నడిచేటప్పుడు ఎండ ఉన్న ప్రాంతాల్లోనే నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19

English summary
Like some other respiratory viruses such as the flu, is there a chance that the new coronavirus will spread less as temperatures increase? A new study has found that the new coronavirus, named SARS-CoV-2, didn't spread as efficiently in warmer and more humid regions of the world as it did in colder areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X