హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ : తెర పైకి 'బేబీ బూమ్'.. 9 నెలల తర్వాత అదే జరుగబోతుందా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పాటిస్తున్న లాక్ డౌన్ ఎలాంటి పర్యవసానాలకు దారితీయబోతోంది. ఎటూ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి చాలా దేశాలు ఇప్పటికే లెక్కల్లో తలమునకలయ్యాయి. కానీ మిగతావాటి పరిస్థితేంటి. ఏ రంగంపై దాని ప్రభావం ఎలా ఉండబోతుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర అధ్యయనాలు,చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'బేబీ బూమ్' అంశం తెర పైకి వచ్చింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ చాలా దేశాల్లో బేబీ బూమ్‌కు దారితీయనుందా..? అసలేంటీ బేబీ బూమ్..? నిపుణులు ఏమంటున్నారు..?

ఏంటీ బేబీ బూమ్..

ఏంటీ బేబీ బూమ్..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు పాక్షిక,సంపూర్ణ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలావరకు పరిశ్రమలు,కంపెనీల సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులకు మునుపెన్నడూ లేనంత ఖాళీ సమయం దొరికింది. కరోనా కారణంగా మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న వేళ.. ఇంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులకు మాత్రం తమ భార్యలతో మరింత సాన్నిహిత్యంగా మెలిగేందుకు వీలు చిక్కింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా ప్రెగ్నెన్సీ రేటు పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే 9 నెలల తర్వాత 'బేబీ బూమ్' ఏర్పడవచ్చునని.. వచ్చే డిసెంబర్-జనవరి నెలల్లో చాలా దేశాల్లో ఎక్కువ సంఖ్యలో శిశువులు జన్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారు..

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నారు..

లాక్ డౌన్ వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెల‌న్‌స్కీ ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఓ టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. లాక్ డౌన్ పీరియడ్‌లో అంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. తగ్గిపోతున్న మన దేశ జనాభాను పెంచేందుకు తమవంతుగా ఇళ్లల్లోనే కృషి చేయాలని చెప్పారు. ఒక్క కరోనా విషయంలోనే కాదు.. గతంలో పలు విపత్తుల సందర్భంలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తి.. అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ రేటు పెరుగుదలకు దారితీశాయి. అమెరికాలో 2013లో వచ్చిన హరీకేన్ తుఫాన్,2015లో న్యూయార్క్‌లో వచ్చిన మంచు తుఫాన్,అలాగే 2017లో వచ్చిన ఇర్మా,మరియా తుఫాన్ల కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో.. ఆ తర్వాత 9 నెలలకు బేబీ బూమ్ సంభవించినట్టుగా చెబుతున్నారు.

అమెరికన్ నిపుణులు ఏమంటున్నారు..

అమెరికన్ నిపుణులు ఏమంటున్నారు..

గత విపత్తులతో పోల్చితే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని.. కాబట్టి చాలామంది దంపతులు ఇప్పుడు పిల్లలను ప్లాన్ చేసుకోకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో.. ఇలాంటి సంక్షోభ సమయంలో పిల్లలను కనడానికి చాలామంది ఆసక్తి చూపకపోవచ్చునని చెబుతున్నారు. 2007లో ఆర్థిక మాంద్యం సంభవించిన సమయంలోనూ ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. హరికేన్,బ్లాక్ ఔట్ లాంటి పరిస్థితులను కరోనా లాక్ డౌన్‌తో పోల్చి చూడలేమని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రొఫెసర్ రోజెలియో సాయెంజ్ తెలిపారు. అవన్నీ తక్కువ కాల పరిమితి ఉన్న విపత్తులని.. కానీ కరోనా ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేం కాబట్టి.. ఇలాంటి అనిశ్చితి నెలకొన్న వేళ దంపతులు పిల్లలు కనడానికి ఆసక్తి చూపించరని అన్నారు. కాబట్టి బేబీ బూమ్ కంటే.. అసలు కొత్తగా పుట్టే బేబీల సంఖ్య కూడా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.

బ్రిటన్ నిపుణులు ఏమంటున్నారు

బ్రిటన్ నిపుణులు ఏమంటున్నారు


బేబీ బూమ్ అవకాశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికన్ నిపుణులు అందుకు ఆస్కారం లేదని చెబుతుండగా.. బ్రిటన్‌కి చెందిన ఓ రిలేషన్‌షిప్ నిపుణుడు డా.షెరీ జాకోబ్‌సన్ మాత్రం బేబీ బూమ్‌కి ఎక్కువ అవకాశం ఉందన్నారు. డా.ఎలేనా తౌరోనీ అనే సైకాలజిస్టు నిపుణురాలు మాట్లాడుతూ.. విడాకుల సంఖ్య పెరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఇక స్కాట్లాండ్‌లో అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.కేథరిన్ స్వయంగా ఓ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గనుక ప్రెగ్నెన్సీ వస్తే డిసెంబర్‌లో క్రిస్మస్ సమయంలో డెలివరీ కావచ్చునని.. ఆ సమయంలో నేషనల్ హెల్త్ సర్వీస్ సెలవుల్లో ఉంటుందని గుర్తు చేశారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండటమే మంచిదని సలహా ఇచ్చారు. మొత్తం మీద కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ నేపథ్యంలో బేబీ బూమ్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది నిపుణులు చెబుతున్నట్టు అందుకు ఆస్కారం ఉందా.. లేక మరికొందరు చెబుతున్నట్టు అలాంటిదేమీ జరగదా.. ఇవన్నీ తెలియాలంటే ఇంకో 9 నెలలు ఆగాల్సిందే.

English summary
AS PEOPLE around the world distance themselves from one another to slow the spread of covid-19, many couples under lockdown find themselves closer than ever. The opportunity has not been lost on Volodymyr Zelensky, Ukraine’s president. In a television appearance last month, Mr Zelensky, like most other world leaders, asked citizens to stay at home. He then called on his compatriots to take advantage of the enforced intimacy to boost the country’s shrinking population: by making babies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X