వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

June 21st 2020: మరో నాలుగు రోజుల్లో ప్రపంచం అంతం కానుందా..?

|
Google Oneindia TeluguNews

ప్రతి కొన్నేళ్లకోసారి ప్రపంచం అంతమవుతుంది అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నేళ్ల క్రితం ప్రపంచం అంతమవుతోందంటూ వచ్చిన వార్త చాలామందిని కలవరపాటుకు గురిచేసింది. ఇక ప్రపంచంపై ప్రాణి అనేది మిగలదు అనే వార్తలు రావడంతో దీన్నుంచి క్యాష్ చేసుకుంది మాత్రం హాలీవుడ్ అని చెప్పాలి. ప్రపంచం అంతం పై ఒక భారీ సినిమా తీసి కొన్ని వేల కోట్ల రూపాయలు హాలీవుడ్ గడించింది. 2012లో భూమి అంతమవుతుందంటూ తెగ హల్చల్ చేసిన వార్త అది పుకారుగానే మిగిలిపోయింది. ఇంతకీ 2012లో అంతమవుతుందనుకున్న ప్రపంచం ఎందుకు కాలేదు..? దీనికి కారణమేంటి..?

 మాయన్ క్యాలెండర్ ఏం చెబుతోంది..?

మాయన్ క్యాలెండర్ ఏం చెబుతోంది..?

2012 డిసెంబర్‌లో ప్రపంచం అంతమవుతుందంటూ వార్తలు జోరుగా షికారు చేశాయి. చాలామంది భయపడ్డారు కూడా. కానీ 2012లో మాత్రం అది జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మళ్లీ ఇంతకాలానికి ప్రపంచం అంతమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా ఈ ఏడాదే అని వార్తలు వస్తున్నాయి. 2012లో ప్రపంచం అంతం అవుతుందని మాయన్ క్యాలెండర్ ప్రకారం చెప్పడం జరిగింది. అయితే అది జరగలేదు. కానీ 2012 డిసెంబర్‌లో అంతం అవుతుందనుకున్న ప్రపంచం ఇప్పుడు 2020 జూన్‌లో అంతం అవుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అది కూడా మయన్ క్యాలెండర్ ప్రకారమే అని చెబుతున్నారు. అంటే మనకు ఈ భూమిపై బతికేందుకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని మాయన్ క్యాలెండర్ ప్రకారం గ్రహించాల్సి ఉంటుంది.

 మాయన్ క్యాలెండర్ అంటే ఏమిటి..?

మాయన్ క్యాలెండర్ అంటే ఏమిటి..?

అయితే ప్రపంచం అంతం అవుతుందో లేదో తెలియదు కానీ ఈ మాయన్ క్యాలెండర్‌ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి ఉంటుంది. డిసెంబర్ 2012లో ప్రపంచం అంతం అవుతుందని భావించిన చాలా మంది ఇప్పుడు జూన్ 2020లో ప్రపంచం అంతమవుతుందని అదే మాయన్ క్యాలెండర్ చెప్పడం వెనక రహస్యం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ మాయన్ క్యాలెండర్ అంటే ఏమిటి..? మాయా నాగరికతలో మాయన్ క్యాలెండర్ వ్యవస్థను వినియోగించేవారు. రోజులు నెలలు ఈ క్యాలెండర్‌ ద్వారానే లెక్కపెట్టేవారు. 4వేల సంవత్సరాల క్రితం వాడేవారు. నేటికీ కొన్ని దేశాల్లో మాయ సంస్కృతి కనిపిస్తుంది.

 సృష్టి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది..?

సృష్టి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది..?

ఇక మాయన్ క్యాలెండర్ సూర్య చంద్రుల కదలికలపై ఆధారపడి ఏర్పాటైంది. ఇందులో 13 రోజులు 20 రోజులు, 260 రోజులు ఇలా ఉంటాయి. ఇలా మొత్తం 20 క్యాలెండర్ వినియోగించారు. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అయితే ఇందులో మూడు క్యాలెండర్లకు అధిక ప్రాధాన్యత ఉంది. ఒకటి లాంగ్ కౌంట్ , జోల్కిన్, మరియు హాబ్ క్యాలెండర్లు.లాంగ్ కౌంట్ క్యాలెండర్ 5,126 ఏళ్లతో ఏర్పాటైంది. అంటే ప్రపంచం సృష్టించబడినప్పటి నుంచి ఏర్పాటైంది. మాయన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం పుట్టింది 11 ఆగష్టు 3114 అని తెలుస్తోంది. జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం ఆవిర్భవించింది 6 సెప్టెంబర్ 3114 అని తెలుస్తోంది. మాయన్ క్యాలెండర్ ప్రకారం 2012 డిసెంబర్ 21న ప్రపంచం అంతమవుతుంది. అదే జూలియన్ క్యాలెండర్ ప్రకారం 21 జూన్ 2020లో ప్రపంచం అంతం అవుతుంది.

Recommended Video

India-Nepal Relations మీద Rajnath Singh కామెంట్లు,భారత భూ భాగాలతో ఉన్నNepal Map ను ఒప్పుకున్నట్టేనా?
 పాలో టగాలోగన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు..?

పాలో టగాలోగన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు..?

ఇదిలా ఉంటే పాలో టగాలోగన్ అనే శాస్త్రవేత్త ప్రపంచం అంతంపై కొన్ని ట్వీట్లు చేశారు. 18వ శతాబ్దంలో జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారడంతో 11 రోజులు తగ్గిపోయాయని చెప్పారు. దీన్నే పరిగణలోకి తీసుకుంటే 18వ శతాబ్దం నుంచి 11 రోజులు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం 8 ఏళ్లు తగ్గిపోయాయి. అంటే లెక్కలోకి రాలేదు. వీటిని 21 డిసెంబర్ 2012కు కూడితే కొత్త తేదీ వస్తుంది. అదే జూన్ 21 అంటే ప్రపంచం అంతం కావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయితే టగాలోగన్ వెంటనే తన ట్వీట్లను తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టగోలస్ థియరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మొత్తానికి ప్రపంచం అంతమవుతుందన్న వార్త ఇప్పుడైనా నిజం అవుతుందా లేక ఇది కూడా ఒక పుకారుగానే మిగిలిపోతుందా తెలియాలంటే మరో నాలుగు రోజుల వరకు ఆగాల్సిందే.

English summary
News is making rounds that the World will end on June 21st after corrections made in the Mayan Calendar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X