• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విండోస్-11; మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రత్యేకతలేంటి...

By BBC News తెలుగు
|

మైక్రోసాఫ్ట్ సంస్థ 'నవతరం' ఆపరేటింగ్ సిస్టమ్ 'విండోస్-11' విడుదల చేసింది. వర్చ్యువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది.

ఈ కొత్త సాఫ్ట్‌వేర్ వాడటం ద్వారా విండోస్ డెస్క్‌టాప్‌పై అన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు పని చేస్తాయి.

windows 11

విండోస్ యూజర్లు సాధారణంగా ఫిర్యాదు చేసే సెక్యూరిటీ అప్‌డేట్‌లతో కూడిన సమస్యలు విండోస్ -11లో ఉండవని ప్రాడక్ట్ మేనేజర్ పానోస్ పనయ్ హామీ ఇచ్చారు. ఇందులో అప్‌డేట్‌లు సంక్షిప్తంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ లో వేగంగా జరుగుతాయని చెప్పారు.

యూజర్లు విండోస్-11ను ఇంట్లో, పని స్థలాల్లో ఉండే పలు డెస్క్‌టాప్‌లకు, గేమింగ్ కోసం కూడా కన్ఫిగర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ప్రస్తుతం 100 కోట్ల 30 లక్షల కంప్యూటర్ పరికరాల పై విండోస్-10 శ్రేణి నడుస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

యాప్ డెవలపర్ల కోసం విండోస్ కొత్త ప్రివ్యూ వెర్షన్ ను వచ్చే వారం విడుదల చేస్తారు.

ప్రస్తుతం విండోస్-10 ఒరిజినల్ వాడుతున్న వారికి ఈ అప్‌గ్రేడ్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ఈ అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటే 64 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి.

ఈ కొత్త విధానంలో స్టార్ట్ బటన్ కంప్యూటర్ ఎడమ వైపు కాకుండా స్క్రీన్ కింద మధ్య భాగంలో ఉంటుంది.

దీంతో పాటు, విండోస్-11 మైక్రో సాఫ్ట్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫార్మ్స్‌తో చాలా సమన్వయంతో పని చేస్తుంది.

కొన్ని వందల గేమ్స్ ఆడేందుకు అవకాశం కల్పించే ఎక్స్ బాక్స్ గేమ్స్ పాస్ కూడా ఈ వెర్షన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేస్తారు. యాప్ స్టోర్ ద్వారా వచ్చే లాభాలను యాప్ సృష్టికర్తలు, డెవలపర్లతో పంచుకుంటామని టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ చెప్పింది.

మరో వైపు ఆపిల్ సంస్థ తమ బిజినెస్ మోడల్‌తో ఉన్న సవాళ్ళను ఎదుర్కొంటోంది.

2015లో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 శ్రేణిని ఆవిష్కరించినప్పుడు, తమ సంస్థ విడుదల చేసే తుది శ్రేణి ఇదే అని ప్రకటించింది. 2025లో విండోస్10 రిటైర్ అవుతుందని కూడా ప్రకటించింది.

ఈ ఆవిష్కరణ "విండోస్ చరిత్రలోనే పెద్ద మైలు రాయి" అని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అభివర్ణించారు.

దీనినొక విప్లవాత్మకమైన అడుగుగా పరిగణించటం లేదని, సిసిఎస్ విశ్లేషకుడు జోఫ్ బ్లేబర్ అన్నారు.

"విండోస్ 10 నుంచి 11 శ్రేణికి పెంచడం ద్వారా విండోస్ 10లో ఎదురైన సమస్యలను నివారించి యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందివ్వాలని మైక్రోసాఫ్ట్ హామీ ఇవ్వాలని చూస్తోంది.

ఈ కొత్త ఆపరేటింగ్ విధానం విండోస్ 10 కోడ్ ఆధారంగానే పని చేయడం వల్ల అప్‌గ్రేడ్ చేయడం వల్ల వచ్చే సమస్యలేమీ ఉండవని ఫారెస్టర్స్ ప్రిన్సిపల్ అనలిస్ట్ జేపీ గౌండర్ అన్నారు. గతంలో విండోస్ విస్టాతో సమస్యలు ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు.

"కానీ, యూజర్లకు స్నేహపూర్వకంగా ఉన్న ఈ ఫీచర్లు రెండు వైపులా పదనైన కత్తిలాంటివే " అని అన్నారు.

"గత అనుభవానికి గొప్ప కొనసాగింపుగా అవి ఉపకరిస్తాయి. కానీ, విండోస్-11 ప్రత్యేకత ఏంటనే ప్రశ్నను కూడా ముందుకు తెస్తాయి. విండోస్-10ను కొత్త ఫీచర్లతో ముస్తాబు చేశారా? లేక మైక్రోసాఫ్ట్ పూర్తిగా కొత్త అనుభవాన్ని అందించిందా?" అన్నది స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని కూడా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Windows-11; Microsoft's latest operating system why is it unique
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X