వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్ దిగ్గజ సంస్థ విప్రో కొత్త సీఈఓగా థియరీ డెలాపోర్ట్...ఎవరీయన..?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అగ్రనాయకత్వంలో మార్పులు చేసింది. విప్రో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్‌ డెలాపోర్ట్‌‌ను విప్రో సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని విప్రో సంస్థ బీఎస్ఈలో చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం అబీదలీ నీముచ్‌వాలా విప్రో సీఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. జూన్ 1 నుంచి కొత్త సీఈఓగా డెలాపోర్ట్ బాధ్యతలు చేపడుతారని ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. తనకు కుటుంబంలో కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుతెలిపారు అబీదలీ. అబీదలీ నాలుగేళ్ల పాటు విప్రో సంస్థకు సీఈఓగా సేవలందించారు.

 విప్రో కొత్త సీఈఓగా డెలాపోర్ట్

విప్రో కొత్త సీఈఓగా డెలాపోర్ట్

ఇక కొత్తగా విప్రో సీఈఓగా బాధ్యతలు చేపడుతున్న డెలాపోర్ట్ విషయానికొస్తే ఈయన ఇప్పటి వరకు మరో టెక్ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీ గ్రూప్‌నకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. క్యాప్‌జెమినీలో ఆయన 25 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించారు. ఈ సమయంలో క్యాప్ జెమినీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. క్యాప్ జెమినీ గ్రూప్‌లో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్‌కు సీఈఓగా వ్యవహరించారు డెలాపోర్ట్. ఇక క్యాప్‌ జెమినీ ఇండియా హెడ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో ఆ కంపెనీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. మంచి వ్యూహాలను అమలు చేసి కంపెనీ లాభాల బాటపట్టడంలో కీలకంగా వ్యవహరించారు.

 విప్రోను అభివృద్ధి పథంలో నడిపిస్తారు: రిషబ్ ప్రేమ్‌జీ

విప్రోను అభివృద్ధి పథంలో నడిపిస్తారు: రిషబ్ ప్రేమ్‌జీ

సీఈఓగా మరియు ఎండీగా థీరీ డెలాపోర్ట్‌ను విప్రో సంస్థలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు విప్రో ఛైర్మెన్ రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు. తనకు మంచి ట్రాక్ రికార్డు, అంతర్జాతీయంగా మంచి పేరు ఉండటం, లోతైన వ్యూహాలను అమలు చేయడం, క్లయింట్ కంపెనీల అనుబంధం సుదీర్ఘకాలంగా కొనసాగించగలిగే సత్తా ఉండటం, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను ఒడిసి పట్టుకుని సంస్థను ముందుకు నడపగలిగే సామర్థ్యం ఉన్నవారు డెలాపోర్ట్‌ అని రిషద్ ప్రేమ్‌జీ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో విప్రో సంస్థను కూడా ముందుండి నడిపిస్తారనే నమ్మకం తనకుందని రిషద్ చెప్పారు.

 పలు సవాళ్లను ఎదుర్కొన్న ప్రస్తుత సీఈఓ అబీదలీ

పలు సవాళ్లను ఎదుర్కొన్న ప్రస్తుత సీఈఓ అబీదలీ

జూలై 6వ తేదీ నుంచి విప్రోలో డెలాపోర్ట్ బాధ్యతలను అధికారికంగా నిర్వర్తిస్తారు. పారిస్‌లో ఉండి విప్రో కార్యకలాపాలను సమీక్షిస్తారని రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు. ఇదిలాఉంటే డెలాపోర్ట్‌ ఎకానమీ మరియు ఫైనాన్స్‌లో పారిస్‌లోని ఓ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేశారు. సార్‌బాన్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశారు. లైఫ్ ప్రాజెక్ట్ ఫర్ యూత్ అనే ఎన్జీఓ సంస్థ సహవ్యవస్థాపకులు. ఔట్ సోర్సింగ్‌లో విప్రో సంస్థ ఒక విప్లవం తీసుకొచ్చింది. ఒక దశాబ్దకాలం పాటు ఔట్ సోర్సింగ్ రంగంలో రారాజుగా వెలుగొందింది. అయితే ఈ సమయంలోనే ఈ సంస్థలో నలుగురు సీఈఓలు మారారు. టెక్సాస్‌ నుంచి విప్రో కార్యకలాపాలు చూస్తున్న ప్రస్తుత విప్రో సీఈఓ నీముచ్‌వాలా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. క్లయింట్లు దివాలా తీయడం, వ్యాపార సామ్రాజ్యాని భారత్‌తో పాటు పశ్చిమాసియా దేశాల్లో విస్తరించడంలో ఒడిదుడుకులు, కొన్ని ఆరోపణలు ఇలా గత నాలుగేళ్లలో పలు సవాళ్లను ఎదుర్కొన్నారు.

English summary
Wipro has anounced new CEO Thierry Delaporte who was a top executive for Capgemini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X