వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్లీల చిత్రాలు: 30 శాతం ఉమెన్, 3వ స్థానంలో భారత్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో పాటు వెబ్‌సైట్లలో అశ్లీల చిత్రాలను చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2015 సంవత్సరానికి గాను పోర్న్ ప్రేక్షకులు ప్రతి సెకనుకు 75 జీబీ శృంగార వీడియోలను చూస్తున్నారని ఓ సర్వే పేర్కొంది.

కాగా, పోర్న్ వీడియోలు చూస్తున్న వారి సంఖ్య భారత్‌లో కూడా క్రమంగా పెరుగుతోంది. తాజా నివేదిక ప్రకారం భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాల చూస్తున్న వారిలో అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, భారత్ మూడో స్థానంలో ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, జర్మనీ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 43 లక్షల గంటల పోర్న్ వీడియోలను చూసారని అందులో పేర్కొంది. అంటే భూమిమీద ప్రతి ఒక్కరూ 12 వీడియోలు చూశారు. మొత్తం పోర్న్ సైట్లకు 21.2 బిలియన్ కోట్ల హిట్స్ వచ్చాయని ఆ సర్వేలో పేర్కొంది.

With 30 Percent of Women Viewers, India Ranks Third in Porn Viewership: Survey

పోర్న్‌హబ్. కామ్ అనే వెబ్‌సైట్ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల ప్రజలు ఏయే పోర్న్‌సైట్‌ను చూశారో అందులో పేర్కొంది. మనదేశంలో కొన్ని రోజుల పాటు ప్రభుత్వం అశ్లీల సైట్లను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినా సరే భారతీయులు మాత్రం వాటిని చూడకుండా ఉండలేకపోయారని ఆ నివేదికలో పేర్కొంది.

కెనడాకు చెందిన సన్నీ లియోన్ ఇప్పుడు భారత్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పోర్న్ స్టార్. ప్రపంచ వ్యాప్తంగా అశ్లీల చిత్రాలను వీక్షించిన వారిలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మొత్తం నెట్ ట్రాఫిక్‌లో 41 శాతం వాళ్లే ఉన్నారు. రెండో స్థానంలో లండన్ ఉంది. తాజా లిస్టులో ఎక్కువ స్థానాలు ఎగబాకిన దేశాల్లో జపాన్, పిలిప్పీన్స్ ఉన్నాయి.

పోర్న్ వీడియోలను ప్రతి వ్యక్తి సగటున 9 నిమిషాల 20 సెకన్లు చూస్తున్నారు. గతేదాది సగటుతో పోలిస్తే ఈసారి ఆరు సెకన్లు పెరిగింది. భారతీయులు మాత్రం యావరేజ్‌గా పోర్న్ వీడియోను చూసేందుకు 9 నిమిషాల 30 సెకన్లు గడుపుతున్నారని ఆ సర్వేలో పేర్కొంది.

కాగా, భారతీయులు మాత్రం స్వదేశీ అశ్లీల చిత్రాలను చూసేందుకే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాదు ఇండియన్ అని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇండియన్ బాబీ, ఇండియన్ యాక్ట్రెస్, ఇండియన్ వైఫ్, ఇండియన్ కాలేజ్, ఇండియన్ ఆంటీ, దేశీ అనే పదాలతో సెక్స్ సైట్లను సెర్చ్ చేస్తున్నారు.

ఇక, అశ్లీల వీడియోలు చూస్తున్న మహిళల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఈ ఏడాది 24 శాతానికి చేరుకుంది. ఆ జాబితాలో పిలిప్పీన్స్ మహిళలు టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పండగ సీజన్‌లో పోర్న్ ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతోందని సర్వేలో పేర్కొంది.

English summary
With Internet services increasing across the country and world, porn websites were surfed at a rate of 75 GB per second in the year 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X