వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెజిల్‌కు వ్యాక్సిన్లు తీసుకెళ్తున్న హనుమంతుడు... బోల్సోనారో ట్వీట్‌కు ప్రధాని మోదీ ఫిదా...

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నందుకు గాను ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో వినూత్న రీతిలో భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. రామాయణంలో లక్ష్మణుడికి సంజీవని కోసం హనుమంతుడు సుమేరు పర్వతాన్ని ఒంటిచేత్తో ఎత్తుకొచ్చినట్లు... బ్రెజిల్‌కు కూడా హనుమంతుడు గాల్లో ఎగురుతూ వ్యాక్సిన్లు తీసుకెళ్తున్నట్లుగా ఓ ఫోటోను జైర్ బోల్సోనారో తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిపై ధన్యవాద్ భారత్ అని రాయడం విశేషం.

'ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారాలు... కరోనా మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు మీలాంటి భాగస్వామిని కలిగివున్నందుకు బ్రెజిల్ గర్వంగా భావిస్తోంది. భారత్‌ నుంచి బ్రెజిల్‌కు వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.' అని బోల్సోనారో ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 With a Hanuman image Brazil President Bolsonaro thanks PM Modi for COVID vaccines

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో ట్వీట్‌పై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... కరోనాపై కలిసికట్టుగా పోరు చేసేందుకు భారత్‌కు విశ్వసనీయ భాగస్వామిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉండటం తాము గర్వపడే విషయమన్నారు. ఆరోగ్య సంరక్షణంలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని మోదీ స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సిన్‌తో జంబలకిడి పంబ.. జనంలో విపరీత గందరగోళం.. బెంబేలెత్తించిన దేశాధ్యక్షుడు..కరోనా వ్యాక్సిన్‌తో జంబలకిడి పంబ.. జనంలో విపరీత గందరగోళం.. బెంబేలెత్తించిన దేశాధ్యక్షుడు..

శుక్రవారమే(జనవరి 22) భారత్ విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదట బ్రెజిల్,మొరాకో దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేశారు. మాల్దీవులు,సౌదీ అరేబియా,సౌతాఫ్రికా,నేపాల్,భూటాన్ దేశాలకు కూడా భారత్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవీషీల్డ్‌ను పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ఆర్డర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు భారత్ వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోంది.

Recommended Video

COVID-19 In India : 90,633 కొత్త కేసులు, US, Brazil కలిపినా ఇండియాకు సమానం కాలేదు!! | Oneindi Telugu

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న భారత్‌పై అమెరికా విదేశాంగ శాఖ ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ సమాజానికి సాయం చేసేందుకు భారత్‌ ముందుకురావడాన్ని అభినందించింది.

English summary
Brazillian President Jair Bolsonaro on Friday thanked Indian Prime Minister Narendra Modi for coronavirus vaccines. India, one of world's biggest drug manufacturers is already helping several countries by providing them coronavirus vaccines. In his tweet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X