వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం? - లదాక్‌ నుంచి కదలని డ్రాగన్ ఆర్మీ - ఢిల్లీలో టాప్ లీడర్ల భేటీ

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. సైనిక, దౌత్య మార్గాల్లో ఇప్పటికే 20సార్లకుపైగా చర్చలు జరిగినా.. డ్రాగన్ బలగాలు ఇంచు కూడా వెనక్కి వెళ్లలేదు. గాల్వాన్ లోయ నుంచి తగ్గినట్లే తగ్గి, పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్లపై చైనా పట్టుబిగించింది. అంతేకాదు, కొత్తగా దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లోనూ భారీగా ఆయుధ సంపత్తిని మోహరించింది. ఏదో ఒక అంగీకారానికి రాకుండా, పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తోన్న చైనాకు ముకుతాడు వేసేలా మోదీ సర్కార్ వ్యూహాలకు పదునుపెట్టింది.

Recommended Video

China పేరు పలకడానికి PM Modi వణుకుతున్నారు - Congress Party || Oneindia Telugu

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

టాప్ లీడర్ల భేటీ..

టాప్ లీడర్ల భేటీ..

ఏప్రిల్ నెలాఖరుకే ఎల్ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరించిన చైనా.. మే మొదటి వారం నుంచి భారత్ కార్యకలాపాలకు అడ్డుతగులుతూ వస్తున్నది. పలు దఫాల సైనిక, దౌత్య చర్చల తర్వాత కూడా వెనక్కి తగ్గని చైనా.. మరింత వేగంగా యుద్ధసన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం దెస్పాంగ్, పాంగాంగ్ ఫింగర్స్, గోగ్రా ప్రాంతాల్లో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. డ్రాగన్ దూకుడు నేపథ్యంలో లదాక్ వ్యవహారాలపై ఏ విధంగా ముందుకెళ్ళాలనేదానిపై కేంద్ర సర్కారులోని టాప్ నేతలు, త్రివిధ దళాధిపతులు, ఇతర కీలక లీడర్లు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.

చైనా వెన్నువిరిచేలా..

చైనా వెన్నువిరిచేలా..

లదాక్ ఏరియా నుంచి చైనా ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో దానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రాగన్ ఆర్థిక మూలాలపై దెబ్బ పడేలా బడా చైనీస్ కంపెనీలపై నిషేధం, ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థి వెన్నువిరిచేలా మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు వినికిడి. రాజకీ, సైనిక వర్గాల మధ్య సోమవారం నాటి కీలక భేటీకి ప్రధాని మోదీ హాజరయ్యేది లేనిది క్లారిటీ రాలేదు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎస్ఢీ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతోపాటు కీలక శాఖలకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా భేటీలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది.

అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్

చివరి భేటీలోనూ సేమ్ సీన్..

చివరి భేటీలోనూ సేమ్ సీన్..

తూర్పు లదాక్ లో టెన్షన్ నివారణ కోసం ఇప్పటికే రెండు సైన్యాల మధ్య వివిధ స్థాయిల్లో పలు మార్లు చర్చలు జరిగాయి. లెఫ్టినెంట్ కమాండర్ల మధ్య ఐదు దఫాలు సమావేశాలు జరగ్గా, చివరిగా కమాండర్ల స్థాయిలో ఈనెల 8న సమావేశం జరిగింది. ఏప్రిల్ నాటి స్టేటస్ కో కోసం పట్టుపట్టిన భారత్.. 10వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 10) నుంచి 13వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ 13) వరకు చైనా వెంటనే వెనక్కి వెళ్లిపోవాలనే డిమాండ్ ను ఉంచింది. చర్చల్లో అతి తెలివి ప్రదర్శించిన చైనా.. ‘‘పాంగాంగ్ లో ముందుగా మీరు ఫింగర్ 1 దాకా వెనక్కెళితే, ఆ తర్వాత మేం ఫింగర్ 8 దాకా తగ్గుతాం''అని మెలిక పెట్టడం, అందుకు భారత్ నో చెప్పడంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.

ఎల్ఏసీలో తాజా సీన్ ఇది..

ఎల్ఏసీలో తాజా సీన్ ఇది..

దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో భారత్ నిర్మించిన రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాలను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న డ్రాగన్ ఇప్పుడా ప్రాంతాన్ని దాదాపు చుట్టుముట్టింది. దెస్పాంగ్, గోగ్రాకు సమీపంగా వేలాది సైన్యాలను మోహరించింది. ఇటు పాంగాంగ్ సరస్సును ఆనుకుని ఉండే ఫింగర్ పాయింట్స్ లోనూ పట్టుబిగించింది. సైనిక చర్చలకుతోడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో దౌత్య మార్గంలోనూ మంతనాలు జరగ్గా.. ఎట్టకేలకు జులై మొదటివారంలో బలగాల ఉపసంహరణ(డీఎస్కలేషన్)కు రెండు దేశాలు అంగీకరించినా.. చైనా మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో భారత్ సైతం బలగాల ఉపసంహరణను నిలిపేసింది.

English summary
With China not disengaging in Finger area, Depsang plains and Gogra after multiple rounds of military talks, top Indian political and military leaders are scheduled to meet on Monday to discuss the way forward there. Chinese troops have been camping in the Finger area for over three months now and have even started fortifying their bases there with construction of bunkers and sangars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X