వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్తలు తక్కువ..సంతా ప్రకటనలు ఎక్కువ: అమెరికాలో న్యూస్ పేపర్ల పరిస్థితి ఇదీ..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ అమెరికాలో విశ్వరూపాన్ని చూపుతోంది. అమెరికాలో గంటల వ్యవధిలో ఈ మహమ్మారి బారిన పడి కొందరు మరణిస్తున్నారు. ఇక ఏ న్యూస్ పేపర్ చూసినా చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ ఉన్న ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికాలో ప్రధాన పత్రికల్లో ఒకటిగా ఉన్న ది బోస్టన్ గ్లోబ్ ఆదివారం సంచిక సందర్భంగా తన పేజీల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సాధారణంగా ఆదివారం సంచిక 16 పేజీలతో వస్తుంది. కానీ ఈ సారి మాత్రం 21 పేజీలతో రాగా ఆ పేజీలన్నీ కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారికి సంతాపం తెలిపే ప్రకటనలే కావడం విశేషం.

ఇదిలా ఉంటే గతేడాది ఏప్రిల్ 28న ది బోస్టన్ గ్లోబ్ పత్రిక ఏడు పేజీలతో మాత్రమే పేపర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పేపర్ చదివే వారు మరణవార్త ప్రకటనలు ఉన్న పేజీలే అధికంగా ఉండటంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ముందుగా కొన్ని పేజీలు సంతాప ప్రకటనలు ఉండగా ఆ తర్వాత స్పోర్ట్స్ పేజ్ ఉందని ఆ తర్వాత మళ్లీ సంతాప ప్రకటనలతో కూడిన పేజీలు కనిపించాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత ఆదివారం విడుదలైన పత్రికలో ప్రధాన వార్తలు క్రీడా వార్తలకు 60 పేజీలు కేటాయించగా... ఇక సంతాప ప్రకటనలకు 20 పేజీలు ప్రత్యేకంగా కేటాయించినట్లు పత్రిక ఎడిటర్ మేరీ క్రీన్ చెప్పారు.

With increase in Coronavirus death toll, US news papers allocates special space for death notices

సాధారణంగా సంతాప ప్రకటనలకు ఒక్క పేజీ మాత్రమే కేటాయిస్తామని చెప్పిన మేరీ క్రీన్.. కరోనావైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సంతాప ప్రకటనలు కూడా పెరిగిపోతున్నాయని .. అదే సమయంలో మృతుల బంధువులు ప్రకటనలు ఇచ్చేందుకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారని చెప్పారు. అయితే మరిన్ని ఎక్కువ పేజీలు కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు మేరీ క్రీన్ చెప్పారు. ఇక ఫలానా వారు మృతి చెందారని అందరికీ తెలిపేందుకే పత్రిక ప్రకటన ఇస్తున్నారని చెప్పారు. అంతేకాదు వారి జ్ఞాపకార్థ కూటములు తేదీలను కూడా పత్రికాప్రకటన ద్వారానే తెలుపుతున్నట్లు మేరీ వివరించారు.

Recommended Video

Kim Jong Un : Kim Jong Un Is In Exile Due To Coronavirus - South Korea

ఆదివారం రోజున అయితే అంతా చూస్తారు కాబట్టి సంతాప ప్రకటనలను అదే రోజు ఇచ్చేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారని మేరీ చెప్పారు. ఇక డిమాండ్‌ను బట్టి సంతాప ప్రకటనలకు పేజీల్లో మరింత స్పేస్‌ను కేటాయిస్తున్నామని వెల్లడించారు. ముందుగా 20 పేజీలు అయితే సరిపోతుందని అనుకున్నట్లు చెప్పిన మేరీ... ఆ తర్వాత వచ్చిన సంతాప ప్రకటనలు చూసి షాక్‌కు గురయ్యామని వెల్లడించింది.

English summary
As the coronavirus continued to claim lives in the past week, the paid death notices in this Sunday’s edition of The Boston Globe surged to 21 pages, up from 16 pages the Sunday before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X