వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగువారి అండతో ఆ గెలుపు: బతుకమ్మ వేడుకల్లో ఆ మహిళా ప్రధాని..?

|
Google Oneindia TeluguNews

ఆక్లాండ్ : దసరా సంబరాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణలో అయితే దసరా సమయంలోనే బతుకమ్మ వేడుకలు జరుపుతారు. బతుకమ్మ పండగ రాష్ట్ర పండగగా ప్రభుత్వం జరుపుతుంది. ఈ బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాధాన్యత విశిష్టత ఉంది. ఘనమైన చరిత్ర బతుకమ్మ పండుగకు ఉంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగువారు బతుకమ్మ పండుగను ఎంతో సంబురంగా జరుపుకుంటారు. ఇక ఆ వేడుకలకు ప్రత్యేక అతిథులు కూడా హాజరవుతుంటారు. ఈ సారి విదేశాల్లో జరుగుతున్న బతుకమ్మ వేడుకకు ప్రత్యేక అతిథి పాల్గొంటారని సమాచారం.ఈ సారి ముఖ్య అతిథి ఎవరో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా సరే అక్కడ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనే పాటు వినిపిస్తోంది. బతుకమ్మను చక్కగా పూలతో అలంకరించి మహిళలు దాని చుట్టూ ఆడుతూ పాడుతూ మన పండగ ప్రాధాన్యతను విదేశీయులకు తెలుపుతున్నారు. విదేశాల్లోని తెలుగువారు బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యేక పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక న్యూజిలాండ్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎప్పుడూ ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డ్రెన్ పాల్గొంటారు. ఇక ఈ సారి న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి రెండో సారి బాధ్యతలు చేపడుతున్న జెసిండా ఆర్డ్రెన్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని సమాచారం.

With landslide victory Newzealand PM Jacinda to participate in Batukamma festival,says sources

గతంలో ఆమె పాల్గొన్న బతుకమ్మ వేడుకల్లో మన తెలుగు మహిళలతో కలిసి ఆటపాట పాడారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ పండగపై ఆమె చాలా చక్కగా మాట్లాడారు. అసలే గెలుపు సంబరాలు చేసుకుంటున్న జెసిండా... ఇప్పుడు ఈ సారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది. జెసిండాకు న్యూజిలాండ్‌లోని తెలుగువారినుంచి మంచి మద్దతు ఉంది. గతంలో కూడా ఆమె శ్రీకృష్ణుడి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోకి ప్రవేశించే ముందు తాను ధరించిన పాదరక్షలు ఆలయం బయటే వదిలి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి భారతీయ హిందూ సమాజం జెసిండాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సారి జరిగిన ఎన్నికల్లో భారతీయులు అంతా మూకుమ్మడిగా జెసిండాకే ఓటు వేసి ఉంటారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

English summary
One Prime Minister of a foreign nation is a regular at the Batukamma festivities and she is none other than Newzealand Prime Minister Jacinda Ardren.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X