వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శానిటైజర్ల కొరత: వోడ్కా, విస్కీలనే శానిటైజర్లుగా వినియోగిస్తున్న హాస్పిటల్స్..ఎక్కడో తెలుసా?

|
Google Oneindia TeluguNews

టోక్యో: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది. ఇందులో ఒకటి శానిటైజర్ల వినియోగం. ఒక శానిటైజర్‌ను నిత్యం మన చెంత ఉంచుకోవడం మంచిదని అప్పుడప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలంటూ సూచించాయి. దీంతో మార్కెట్లలో శానిటైజర్లకు బాగా డిమాండ్ రావడంతో వాటి సప్లయ్ కూడా తగ్గిపోయింది. శానిటైజర్ల కొరత ఏర్పడింది.

 జపాన్‌లో శానిటైజర్ల కొరత...

జపాన్‌లో శానిటైజర్ల కొరత...

శానిటైజర్ల కొరత ఏర్పడటంతో ఎవరికి వారు తోచినట్లుగా ఇళ్లల్లోనే శానిటైజర్లను తయారుచేసుకుంటున్నారు. టీవీల్లో, సోషల్ మీడియాల్లో శానిటైజర్ల తయారీ పద్దతిని చూసి మరీ సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జపాన్‌లో మాత్రం శానిటైజర్ల కొరత రావడంతో అక్కడి హాస్పిటల్స్ సరికొత్త ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఎలాగో అలాగ నెట్టుకొస్తున్న జపాన్‌లోని హాస్పిటల్స్ ఇక శానిటైజర్లు తప్పదని భావించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాయి. శానిటైజర్ల వినియోగం తప్పని సరి అనుకున్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న మద్యంను శానిటైజర్లుగా వినియోగిస్తున్నాయి.

 ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను శానిటైజర్లుగా వినియోగించొచ్చు

ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను శానిటైజర్లుగా వినియోగించొచ్చు

ప్రస్తుతం దేశంలో శానిటైజర్ల కొరత ఉన్నందున జపాన్ ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 70 నుంచి 83శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న మద్యంను శానిటైజర్లకు బదులుగా వినియోగించవచ్చని ఆరోగ్యశాఖ విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఉంది. కొన్ని వోడ్కాల్లో ఇంతే మోతాదుతో అంటే 70 నుంచి 83శాతం ఆల్కహాల్ కలిగి ఉన్నాయి. అయితే జపాన్‌లో పాపులర్ అయిన సేక్ అండ్ షోచు బ్రాండ్ మాత్రం తమ మద్యం తయారీలో 22 నుంచి 45 శాతం ఆల్కహాల్ మాత్రమే వినియోగిస్తుంది. ఇక ఇదే అదనుగా భావించిన కొన్ని మద్యం కంపెనీలు ప్రభుత్వం సూచించిన 70శాతం నుంచి 83శాతం ఆల్కహాల్‌తో కూడిన మద్యంను తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేయడం వల్ల అటు శానిటైజర్లుగా ఇటు మద్యం ప్రియులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి.

 శానిటైజర్ల కోసం అధికంగా ఆల్కహాల్ కంటెంట్‌తో మద్యం

శానిటైజర్ల కోసం అధికంగా ఆల్కహాల్ కంటెంట్‌తో మద్యం

జపాన్‌లోనే అతిపెద్ద మద్యం తయారీ కంపెనీ సంటోరీ ఇప్పటికే అమెరికాలో శానిటైజర్లను తయారు చేస్తోంది. అమెరికాలో రోజురోజుకీ కరోనావైరస్ కేసులు పెరిగిపోతుండటం, శానిటైజర్ల కొరత తీవ్రతరం కావడంతో జపాన్ కంపెనీ శానిటైజర్లను తయారు చేస్తోంది. జపాన్ నిబంధనల ప్రకారం క్రిమిసంహారక మందుల్లో ఆల్కహాల్ 76.9 నుంచి 81.4శాతం ఉండాలి. ఈ శాతం కంటే తక్కువగా ఉంటే అది పనిచేయదని అర్థం. ఇక అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే జపాన్‌లో కరోనావైరస్ కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలోనే టోక్యోలో కేసులు పెరిగిపోవడంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది.

Recommended Video

COVID-19 : Reliance Contributes Rs 5 Crore to Andhra Pradesh CM Relief Fund

English summary
Strong alcoholic drinks can be used "when absolutely necessary" instead of hand sanitiser in Japanese hospitals, authorities said, as supplies run dry as a result of the coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X