వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ రద్దు.. ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ నిలిపివేత కోరుతూ 20 ప్రతిపక్ష పార్టీల తీర్మానం.. బీజేపీ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైందని, కాబట్టి ఈ వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే దేశవ్యాప్త ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ ప్రక్రియను కూడా వెంటనే నిలిపేయాలని కాంగ్రెస్ నాయకత్వంలో 20 ప్రతిపక్ష పార్టీలు తీర్మానించాయి.

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ రాజ్యాంగ విరుద్ధమైనవేకాకుండా దేశంలోని పేదలు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనార్టీలను అణిచేయాలన్న లక్ష్యంతో రూపొందించినట్లున్నాయని ఆరోపించిన ప్రతిపక్ష పార్టీలు... తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ మూడు ్రక్రియలను చేపట్టబోమంని తీర్మానంలో పేర్కొన్నాయి. సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ లో సోనియా గాంధీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది.

 Withdraw CAA, stop NRC, NPR: 20 Opposition parties pass resolution

ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం చేతగాకే ప్రధాని మోదీ ఇతర అంశాలపై ఫోకస్ పెట్టారని, ప్రజల మధ్య మతపరమైన చిచ్చులుపెట్టే వివాదాలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించాయి. ఢిల్లీ జేఎన్ యూ, జామియా వర్సిటీలతోపాటు దేశవ్యా్తంగా పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత హింసను ప్రజలు గుర్తించారని తీర్మానంలో పేర్కొన్నారు.

కాగా, సీఏఏ రద్దు.. ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ నిలిపివేత కోరుతూ 20 ప్రతిపక్ష పార్టీల చేసిన తీర్మానంపై బీజేపీ సెటైర్లు వేసింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా ప్రతిపక్ష పార్టీల తీర్మానం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను సంతోషపెట్టి ఉంటుదని.. వాళ్లంతా ఒకే భాషలో మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏ అమలు ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.

English summary
At a Congress-led meeting on Monday in the Parliament complex, 20 opposition parties passed a resolution demanding the withdrawal of the contentious Citizenship Amendment Act (CAA) and immediate stoppage of the nationwide National Population Register (NPR) exercise
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X