వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు చైనా మూడు ఆప్షన్స్: వెనక్కి తగ్గకపోతే చంపబడొచ్చంటూ హెచ్చరిక..

స్వచ్చందంగా భారత సైన్యం వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం జరగకపోతే సైనికులు చంపబడవచ్చంటూ హెచ్చరికలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య వివాదం ముదురుతూనే ఉంది. భూటాన్ సరిహద్దులోని డొక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఆరోపణలు,ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. డోక్ లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారిని అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని చైనా ముందు నుంచి ఆరోపిస్తోంది.

మాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీమాదీ 1962 చైనా కాదు, అందుకే భారత్ ఇలా: రెచ్చగొట్టేలా డ్రాగన్ కంట్రీ

చైనా మీడియా సైతం భారత సైన్యానికి హెచ్చరికలు చేస్తూ కథనాలు ప్రచురిస్తూనే ఉంది. దౌత్యపరమైన సమాలోచనల ద్వారా ఈ ప్రతిష్టంభనకు పరిష్కారం దొరకదని, బేషరతుగా భారత్ తమ బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాలని డ్రాగన్ హెచ్చరిస్తోంది.

withdraw capture or get killed: china warning to india

తాజాగా ముంబైలో చైనా కౌన్సిల్ జనరల్ గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా సెంట్రల్ టెలివిజన్ ఇంగ్లీష్ చానెల్‌తో మాట్లాడుతూ మూడు సూచనలు చేశాడు. సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరో దేశ భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులుగా పరిగణించబడుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కోవాలని చెప్పారు.

1.స్వచ్చందంగా వెనక్కి తగ్గడం లేదా పట్టుబడటం
2.సరిహద్దు వివాదం ముదిరితే.. సైనికులు చంపబడవచ్చు.
3.చైనా వేచి చూసే ధోరణితో ఉందని, భారత్ అర్థవంతమైన సున్నిత ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని అన్నారు.

English summary
If you browse through the latest headlines about the now month-long border stand-off between India and China, you might think the Asian rivals are teetering on the brink of an armed conflict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X