వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు ప్రాణభయం! ఇవాంకను అనుకున్నారట!: మైఖేల్ వూల్ఫ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అంచనాలను తలకిందులు చేస్తూ గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు డొనాల్డ్ ట్రంప్‌. అయితే ఆయన అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదట. అంతేగాక, ట్రంప్‌ ఎన్నికల్లో గెలిచారనే విషయం తెలియగానే మెలనియా ఏడ్చేశారట.

ఈ విషయాన్ని అమెరికన్‌ జర్నలిస్ట్‌ మైఖెల్‌ వూల్ఫ్‌ తాను రాసిన 'ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ది ట్రంప్‌ వైట్‌ హౌస్‌' అనే పుస్తకంలో పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిచారు అని టీవీలో రాగానే ఏదో దెయ్యాన్ని చూసినట్లుగా ఆయన ఫీలయ్యారని మైఖెల్‌ వివరించారు.

ఫేమస్ కావాలన్న కలతో..

ఫేమస్ కావాలన్న కలతో..

ప్రపంచంలోనే ఫేమస్‌ వ్యక్తి కావాలన్నది తన కలని.. అధ్యక్షుడిగా గెలవాలని మాత్రం కాదని ట్రంప్‌ తన స్నేహితుడైన సామ్‌ నన్‌బర్గ్‌కు చెప్పారట. బుల్లితెర రంగంలో కెరీర్‌ బాగుండాలంటే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాల్సిందేనని ట్రంప్‌కు తన స్నేహితుడు రోజర్‌ ఎయిల్స్‌ చెప్పారు. అతని మాట మీదే ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేశారు.

ఇవాంకా పోటీ చేయాలని..

ఇవాంకా పోటీ చేయాలని..

ఈ పుస్తకం రాయాల్సిందిగా ట్రంపే తనను ప్రోత్సహించారని మైఖెల్‌ తెలిపారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆయన కుమార్తె ఇవాంక పోటీ చేయాలని భావించారట. ఈ విషయాన్ని ఆమె తన భర్త జేర్డ్‌ కుష్నర్‌ వద్ద ప్రస్తావించారు.

ట్రంప్ చాలా కష్టపడ్డారు..

ట్రంప్ చాలా కష్టపడ్డారు..

ట్రంప్‌ వైట్‌హౌస్‌లోకి వచ్చాక అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి చాలా కష్టపడ్డారని మైఖెల్‌ పుస్తకంలో పేర్కొన్నారు. తన గదిలో టూత్‌బ్రష్‌తో సహా తన వస్తువులను ఎవ్వరూ ముట్టుకోకూడదని వైట్‌హౌస్‌ సిబ్బందికి కఠిన నిబంధనలు విధించారు.

విషం పెట్టి చంపుతారనే భయం

విషం పెట్టి చంపుతారనే భయం

ఎవరైనా విషం పెట్టి తనని చంపాలనుకుంటారని ట్రంప్‌కు చాలా కాలం భయపడుతుండేవారని మైఖెల్‌ వివరించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌కు ప్రాణ భయం పట్టుకుందని చెప్పారు. విష ప్రయోగం చేసి తనను హతమారుస్తారనే భయంతో ఎక్కువగా మెక్‌డొనాల్డ్స్‌ బర్గర్‌లనే తినేవారని వెల్లడించారు. ట్రంప్ కొందరు తన పాత స్నేహితులను కూడా గుర్తించేవారు కాదని పేర్కొన్నారు.

English summary
In the second excerpt published from Michael Wolff’s new book, the journalist paints a portrait of a President Trump who is increasingly repeating stories, cannot recognize old friends, and is viewed by his closest allies as “incapable of functioning in his job.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X