వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో మహిళపై పాడుపని.. సంచలన ఆరోపణలు, క్షమాపణ కోరిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ భవనం.. దేవాలయంతో సమానం, ప్రజల కోసం చట్టాలు చేసే గొప్ప ప్రాంగణం. అలాంటి చోట కూడా పాడుపని జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఓ మహిళ ఆరోపణలు చేశారు. దీంతో సాక్షాత్ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ స్పందించారు. ఆ మహిళకు క్షమాపణలు చెప్పడమే గాక.. విచారణ జరిపిస్తామని హామీనిచ్చారు.

వివాదంలో సర్కార్

వివాదంలో సర్కార్


ఆస్ట్రేలియా ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. పార్టమెంట్‌లోని రక్షణమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అత్యాచారం జరిగిందని ఓ మహిళ ఆరోపించారు. దారుణ ఘటనను తొక్కిపెట్టేందుకు పై అధికారులు ప్రయత్నించారని తెలిపారు. ఫిర్యాదు చేయవద్దని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో ప్రధాని స్కాట్ మారిసన్ బాధితురాలికి క్షమాపణలు చెప్పారు.

2019లో ఘటన

2019లో ఘటన

ఘటనపై లోతైన దర్యాప్తు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. 2019లో ఈ దారుణం జరిగినట్టు బాధితురాలు ఆరోపించారు. రక్షణశాఖ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో ప్రధాని నేతృత్వంలోని అధికారికి లిబరల్ పార్టీకి చెందిన తన సహోద్యోగి ఒకరు దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపించారు. వారందరూ ఓ రోజు రాత్రి పార్టీ చేసుకున్న సందర్భంగా దారుణం జరిగిందని చెప్పారు. తదనంతరం..తాను పోలీసులను ఆశ్రయించానని, కానీ తన కేరీర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే భయంతో ఆగానని ఆమె పేర్కొన్నారు.

జరిగింది వాస్తవమే..

జరిగింది వాస్తవమే..

పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తమ దృష్టికి తీసుకొచ్చారని అంగీకరించారు. ఘటన గురించి లిండా కార్యాలయంలో గల సీనియర్ సిబ్బంది దృష్టికి కూడా తెచ్చానని బాధితురాలు తెలిపారు. ఆ తరువాత.. అత్యాచారం జరిగిన కార్యాలయంలోనే ఓ సమావేశానికి హాజరు కావాలంటూ కార్యాలయ ఉన్నతాధికారులు కోరారని ఆమె పేర్కొన్నారు.

ఫిర్యాదు చేశారు.. కానీ

ఫిర్యాదు చేశారు.. కానీ


రక్షణ మంత్రి లిండా కూడా తనకు ఫిర్యాదు అందిన విషయాన్ని సోమవారం అంగీకరించారు. ఫిర్యాదు చేయకుండా మహిళపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. ఇది పెను వివాదంగా మారుతుండటంతో మంగళవారం ఏకంగా దేశ ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. ఈ దారుణం జరిగుండాల్సింది కాదని.. క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ పూర్తి భద్రత కల్పించే బాధత మాదని కామెంట్ చేశారు.

English summary
woman alleges she was raped in parliament, australian prime minister racted.. apologises to woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X