వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘ఆడవాళ్లు బలహీనులు, తెలివీ తక్కువే, అంతంత సంపాదన అవసరమా?’’

బ్రసెల్స్: మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ సంపాదించాలి. ఎందుకంటే వాళ్లు బలహీనులు, చిన్న వాళ్లు, వాళ్లకు తెలివి కూడా తక్కువే. ఈ డైలాగులు కొట్టింది ఓ రాజకీయ వేత్త.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బ్రసెల్స్: మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ సంపాదించాలి. ఎందుకంటే వాళ్లు బలహీనులు, చిన్న వాళ్లు, వాళ్లకు తెలివి కూడా తక్కువే. ఈ డైలాగులు కొట్టింది ఓ రాజకీయ వేత్త. అది కూడా యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో.

పోలాండ్ కు చెందిన జానుస్ కొర్విన్ మిక్కీ ఈ విద్వేష ప్రసంగం చేశారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో కొర్విన్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆయన ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ కు ఓ మహిళా ఎంపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. స్పానిష్ ఎంపీ గార్షియా పెరేజ్ పోలాండ్ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా తిప్పికొట్టారు.

 Woman are ‘less intelligent’ and ‘must earn less than men,’ Polish EU politician says

మహిళలు పార్లమెంట్ కు రావడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తోందన్న విషయం అర్థమైందని, యూరోపియన్ మహిళల హక్కులను కాపాడేందుకే తాను సభకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.

సిగ్గుచేటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ కొర్విన్ పై చర్యలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆంటోనియో తజానిని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ప్రెసిడెంట్ పార్లమెంట్ రూల్ ప్రకారం ఎంపీ వ్యాఖ్యలపై విచారణ మొదలైంది. ఒకవేళ కొర్విన్ చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే ఆయనకు జరిమానా లేదా సస్పన్షన్ విధిస్తారు.

English summary
WARSAW, Poland — A Polish member of the European Parliament has launched another sexist tirade, calling it a “20th century stereotype that women have the same intellectual potential as men,” and that the stereotype “must be destroyed because it is not true.” Janusz Korwin-Mikke’s insults on Friday in Warsaw came two days after he told the European Parliament that “women must earn less than men because they are weaker, they are smaller, they are less intelligent.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X