వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలికలాం: లక్ష్యాలకు పెళ్లి అడ్డంకిగా మారిందని స్వీయవివాహం చేసుకున్న మహిళ

|
Google Oneindia TeluguNews

ఆమెకు పెళ్లి అంటేనే చిరాకు. వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయింది. తనమీద ఒకరి పెత్తనం ఏంటని భావించింది. పెళ్లి అనే పేరు పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛను సమాజం చంపేస్తోందంటూ భావించిన ఓ 32 ఏళ్ల మహిళ తనను తానే వివాహం చేసుకుంది. ఈ ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతున్న లులూ జర్మియా అనే మహిళ పెళ్లి చేసుకుని స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేక తనను తానే వివాహం చేసుకుంది. అంతేకాదు ఆ స్వవివాహానికి కుటుంబ సభ్యులను,మిత్రులను, బంధువులను కూడా ఆహ్వానించింది. వారందరికి మంచి పార్టీ కూడా ఇచ్చింది.

 పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చిన యువతి

పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చిన యువతి


వివాహం చేసుకుంటున్నానని చెప్పి అందరికీ కబురు పంపింది లులూ. వివాహ వేదిక వద్దకు బంధువులు, మిత్రులు చేరుకున్నారు. అందమైన వెడ్డింగ్ గౌన్ వేసుకున్న పెళ్లి కుమార్తె లులూ వచ్చింది. ఇక పెళ్లి కుమారుడి కోసం అంతా వెయిట్ చేస్తుండగా ఒక్కసారిగా వారికి షాక్ ఇచ్చింది లులూ. తను ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని తనను తానే వివాహమాడబోతున్నట్లు చెప్పి వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చింది. అయితే తనను తాను వివాహం చేసుకోవడం ఎవరికీ నచ్చలేదని చెప్పింది లులూ. కానీ తాను అనుకున్నది మాత్రం నెరవేర్చుకుంది. అంతేకాదు తన పెళ్లికి కేవలం రెండు పౌండ్లు మాత్రమే ఖర్చు అయ్యిందని చెప్పుకుంది. అదికూడా వివాహ వేదిక వద్దకు చేరుకునేందుకు ట్యాక్సీ ఖర్చు అయ్యిందని వెల్లడించింది.

చదువుల గురించి ఎవరూ అడగడం లేదు.. పెళ్లి పైనే ప్రశ్నిస్తున్నారు

చదువుల గురించి ఎవరూ అడగడం లేదు.. పెళ్లి పైనే ప్రశ్నిస్తున్నారు

" జీవితంలో నేను చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటిని చేరుకునేందుకు చాలా కష్టపడుతున్నాను. ఒక మంచి విద్యావేత్తగా స్థిరపడాలనేదే నా లక్ష్యం. నేను చదువుపై దృష్టిసారిస్తుంటే నా కుటుంబ సభ్యులేమో నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానా అనే ప్రశ్నలతో చంపేస్తున్నారు. అంతేకాదు పిల్లలను ఎప్పుడు కంటావు, ఒక కుటుంబాన్ని ఎప్పుడు ఏర్పరచుకుంటావు అనే ప్రశ్నలు వేస్తున్నారు " అని లులూ తెలిపింది.

లక్ష్యాలకు పెళ్లి అడ్డుగా ఉంది

లక్ష్యాలకు పెళ్లి అడ్డుగా ఉంది

లులూ పెళ్లికి ఆమె తల్లిదండ్రులు హాజరు కాలేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో తనను తానే వివాహం చేసుకోవాల్సి వచ్చిందో వారికి వివరంగా వివరించింది లులూ. తన తల్లి కాస్త కన్ఫ్యూజన్‌కు గురై కొంత బాధపడిందని వెల్లడించింది. పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని అయితే అది లక్ష్యాలను అణచివేసేదిగా ఉండకూడదనే తనను తాను పెళ్లి చేసుకున్నట్లు లులూ స్పష్టం చేసింది. మరోవైపు తన చదువు కొనసాగేందుకు విరాళాలు కావాలంటూ గోఫండ్ పేజ్ ఏర్పాటు చేసింది. అందులో తన లక్ష్యాలను తన కథను వివరించి తనకు ఆర్థికంగా అండగా నిలవాలంటూ పోస్ట్ చేసింది.

English summary
This is perhaps the most emphatic statement on individual liberty. A woman, a 32-year-old student of Oxford – was so fed up with the social pressure of marriage that she decided to end all controversy by marrying herself! Lulu Jemimah, a single Ugandan woman who is studying creative writing at the prestigious university, set up a mock wedding party and even invited her family and friends to it. There was, however, no groom at the event and Lulu, wearing a beautiful wedding dress, told the guests that she was getting married to none other but herself, according to a Daily Mail report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X